అబ‌ద్ధాల‌తో ఎన్నిక‌ల‌ అరాచ‌కాల‌ను క‌ప్పిపుచ్చే కుట్ర‌

వైఎస్సార్‌సీపీ అధికార ప్ర‌తినిధి పుత్తా శివ‌శంక‌ర్ ఫైర్ 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన పార్టీ అధికార ప్ర‌తినిధి పుత్తా శివ‌శంక‌ర్ 

 స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో వెన్నుపోటు పార్టీ అక్ర‌మాల‌ను ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నారు

 నిజాయితీ ఎన్నిక‌ల్లో పోటీ చేసి గెలిచే  ద‌మ్ము లేదని తేలిపోయింది

 దాన్నుంచి ప్ర‌జ‌ల‌ను డైవ‌ర్ట్ చేసేందుకు రోడ్డు ధ్వంసం పేరుతో దుష్ప్ర‌చారం 

 సంబంధం లేని డ్ర‌గ్స్ కేసును వైఎస్సార్‌సీపీ నాయ‌కుడికి అంట‌గ‌ట్టారు

  ప్రెస్ మీట్ లో వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వ తీరును ఎండగట్టిన పుత్తా శివ‌శంక‌ర్ 

తాడేప‌ల్లి: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుపెట్టుకుని వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం సాగిస్తున్న అరాచకాలు, హింసాత్మక రాజకీయాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ త్రయం ఎల్లో మీడియాతో కలిసి కుట్రపూరిత ప్రచారానికి తెరలేపిందని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ ధ్వజమెత్తారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతు పొలంలో రోడ్డు వ్యవహారం, సత్యనారాయణకు సంబంధించిన డ్రగ్స్‌ కేసును తెరపైకి తీసుకొచ్చి వైఎస్సార్‌సీపీపై బురదజల్లే కుట్ర జరుగుతోంద‌ని ఆక్షేపించారు. రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల అక్రమాలు, దాడులు, నామినేషన్ల అడ్డగింతలపై సమాధానం చెప్పాల్సిన పాలకులు సంబంధం లేని అంశాలను రాజకీయ ప్రచారానికి వాడుకోవడం దేనికి సంకేతమ‌ని ప్ర‌శ్నించారు. ఈ రెండు వ్యవహారాల్లో ఉన్న వాస్తవాలను శివ‌శంక‌ర్ ప్రజల ముందు ఉంచారు. 

ఆయ‌న ఇంకా ఏమ‌న్నారంటే...

రైతు పొలంలో రోడ్డు వివాదంలో వాస్తవాలు: 
తిరుపతి జిల్లా కడప పార్లమెంటు పరిధిలోని పుల్లంపేట మండలం, అనంతసముద్రం గ్రామంలో రైతు పొలంలో రోడ్డు వేశారనే అంశంపై పవన్ కళ్యాణ్, చంద్రబాబు వైఎస్సార్‌సీపీ పై అసత్య ఆరోపణ‌లు చేస్తున్నారు. ఈ అంశంపై జూలై 3, 2026 న ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పంచాయతీరాజ్ శాఖ, కలెక్టర్, అధికారులపై రిట్ పిటిషన్ దాఖలైంది. అనంత సముద్రం గ్రామానికి చెందిన రైతుల భూముల మీదుగా గ్రావెల్‌ రోడ్డు వేయడాన్ని సవాలు చేస్తూ ఏపీ హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలైంది. సర్వే నంబర్లు 351, 352కు సంబంధించిన భూముల్లో ఎలాంటి భూసేకరణ ప్రక్రియ చేపట్టకుండా రోడ్డు వేయడాన్ని రైతులు ప్రశ్నించారు. భూసేకరణ చట్టం ప్రకారం తమకు న్యాయమైన పరిహారం కల్పించకుండా, తమ భూములపై హక్కులకు భంగం కలిగించవద్దని కోరారు. 

ఈ వ్యవహారంలో ప్రభుత్వం తరఫున కోర్టుకు సమర్పించిన వివరణలో, సంబంధిత భూముల్లో గ్రావెల్‌ రోడ్డు వేయడానికి గ్రామ పంచాయతీకి ఎలాంటి ప్రతిపాదన లేదని, ఆ సర్వే నంబర్లలో ఏ నిధుల కిందా రోడ్డు నిర్మించలేదని పేర్కొన్నట్లు మా దగ్గర ఉన్న పత్రాలు చెబుతున్నాయి. 
కోర్టులో ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్ స్పష్టంగా దాఖలు చేసిన రాతపూర్వక నివేదికలో పిటిషనర్ల భూమిలో ఎటువంటి గ్రావెల్ రోడ్డు వేసే ప్రపోజల్ లేదని, అసలు ఆ సర్వే నంబర్లలో ఎలాంటి రోడ్డు వేయలేదని కోర్టుకు తెలిపింది. హైకోర్టులో ప్రభుత్వం "వేయలేదు, ప్రపోజల్ లేదు" అని చెప్పిన కేవలం రెండు నెలల వ్యవధిలోనే, కాంట్రాక్టర్లతో కుమ్మక్కై కమీషన్ల కోసం అర్ధరాత్రి రోడ్లు వేసి, ప్రశ్నించిన రైతులపై ఎదురుదాడికి దిగడం ప్రభుత్వ దౌర్జన్యానికి నిదర్శనం. దీన్ని కప్పి పుచ్చుకోవడానికి వైఎస్సార్‌సీపీ పై లబ్దికోసం బురద జల్లుతున్నారు. 
రైతు తన భూమిలో తన అనుమతి లేకుండా, పరిహారం చెల్లించకుండా రోడ్డు వేశారని అభ్యంతరం వ్యక్తం చేస్తే దానికి సమాధానం చెప్పాల్సింది ప్రభుత్వం కాదా? రైతు పొలంలో రోడ్డు వేసిన వ్యవహారాన్ని తీసుకుని పవన్‌ కళ్యాణ్‌ హడావుడి చేయడం, ఆ తర్వాత చంద్రబాబు, లోకేష్‌  రంగంలోకి దిగి వైఎస్సార్‌సీపీ పై ఆరోపణలు చేయడం, ఎల్లో మీడియా దాన్ని మరింత పెద్ద వివాదంగా చిత్రీకరించడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి? అసలు ఈ వ్యవహారంలో వైఎస్సార్‌సీపీ కి సంబంధం ఏమిటి?

సత్యనారాయణ ఉదంతంపై...:  
కాకినాడకు చెందిన సత్యనారాయణ ఉదంతాన్ని అడ్డం పెట్టుకుని వైఎస్సార్‌సీపీ పై ఎల్లో మీడియా దుష్ప్రచారం మొద‌లుపెట్టింది. మా దగ్గర ఉన్న వివరాల ప్రకారం, సత్యనారాయణతో కలిసి ప్రయాణించిన అరుణ్‌ అనే వ్యక్తి తన లగేజీ ఎక్కువ కావడంతో కొన్ని వస్తువులను సత్యనారాయణ బ్యాగులో పెట్టినట్లు కోర్టులో వెల్లడించాడు. ఆ వస్తువులతో సత్యనారాయణకు సంబంధం లేదని, ఆయన కేవలం ప్రయాణంలో భాగంగా ఉన్నారని కోర్టులో అంగీక‌రించాడు. సత్యనారాయణకు సంబంధం లేదని, ఆయన కేవలం టూరిస్ట్ గా వెళ్లారని స్వయంగా ఎర్నాకులం కోర్టులో తోటి ప్రయాణికుడు అరుణ్‌ లిఖితపూర్వకంగా ఇచ్చిన స్టేట్మెంట్‌తో స్పష్టమైంది. ఆరోప‌ణ‌లు వ‌చ్చిన వెంట‌నే స‌త్య‌నారాయ‌ణ‌ను పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేశాం. ఇప్పుడు ఆయ‌నకు డ్ర‌గ్స్ కేసుతో సంబంధం లేదు కాబ‌ట్టి స‌స్పెన్ష‌న్ ఎత్తివేసే విష‌యం పార్టీ ప‌రిశీలించ‌వ‌చ్చు. 

మరి ఇదే కూటమి ప్రభుత్వంలో స్వయంగా డ్రగ్స్ కేసులో దొరికి, జైలుకు వెళ్లి, నార్కో టెస్ట్ లోనూ రుజువై, మేనేజ్ చేసుకుని బయట తిరుగుతున్న టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ యాదవ్, అలాగే ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సుపుత్రుడు సుధీర్ ల డ్రగ్స్ బాగోతాలు ఎల్లో కళ్లకు ఎందుకు కనిపించడం లేదా? అని ప్ర‌శ్నించారు. 

కూట‌మి ప్ర‌భుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారు:  
దసరా పండుగ పూట కూడా ఈ ప్ర‌భుత్వం ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తుంది. విజయ దశమి పండుగను ప్రజలు సంతోషంగా జరుపుకోవాల్సిన తరుణంలో, ఈ ప్రభుత్వ పోలీసులను అడ్డుపెట్టుకుని చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ గూండాలు రాష్ట్రంలో అరాచకం సాగిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ నాయకులను, కార్యకర్తలను, చివరికి ప్రజలను కూడా స్వేచ్ఛగా తిరగనీయకుండా అణిచివేస్తూ ఆంధ్రప్రదేశ్‌ను ‘సౌతిండియాలో బీహార్ గా మార్చేశారు. ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం లేక ఇతర రాష్ట్రాల నుంచి రౌడీలను తెచ్చి రాయలసీమ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్నారు. రాష్ట్రంలో పెట్టుబడిదారులు వణికిపోయేలా, పరిశ్రమలు పారిపోయేలా ఈ కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అరాచక అగ్నిగుండంగా మారుస్తోంది. ప్రతిపక్ష పార్టీలను, అభ్యర్థుల నామినేషన్లను కూడా అడ్డుకుంటున్న ఈ రాక్షస పాలనకు కాలం చెల్లింది. రాబోయే రోజుల్లో ప్రజలు ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని పుత్తా శివ‌శంక‌ర్ హెచ్చరించారు.

Back to Top