టీడీపీకి షాక్‌.. వైయ‌స్ఆర్‌సీపీలోకి సీనియర్‌ నాయకుడు

మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు సమక్షంలో నర్సిపురం టీడీపీ నేత బర్ల సత్యం చేరిక

పార్వతీపురం: స్థానిక సంస్థల ఎన్నికల వేళ పార్వతీపురం నియోజకవర్గంలో టీడీపీకి చెందిన సీనియర్‌ నాయకులు వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. విజయదశమి సందర్భంగా నర్సిపురం గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్‌ నాయకుడు బర్ల సత్యం తన కుటుంబ సభ్యులతో కలిసి మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు సమక్షంలో వైయ‌స్ఆర్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. గ్రామానికి చెందిన వైయ‌స్ఆర్‌సీపీ నాయకులతో కలిసి క్యాంపు కార్యాలయానికి వచ్చిన వారికి జోగారావు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం, గౌరవం కల్పిస్తామని జోగారావు తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని, నర్సిపురం గ్రామంలో వైయ‌స్ఆర్‌సీపీకి పూర్వ వైభవం తీసుకురావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సీనియర్‌ నాయకులు వెంపలి గురురాజు, గ్రామ పార్టీ అధ్యక్షుడు తేర్లీ శ్రీనివాసరావు, ఎంపీటీసీ అభ్యర్థులు తెర్లీ హేమలత, తర్లాడ సరస్వతి, మాజీ పీఏసీఎస్‌ చైర్మన్‌ తెర్లి రామస్వామి, ఎస్సీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి భూతల వెంకటరమణ, జిల్లా యూత్‌ కార్యదర్శి కోట సంజీవి నాయుడు, సీనియర్‌ నాయకులు శెట్టి వెంకట నాయుడు, వోలేటి మణిభూషణ్‌, బర్ల రామకృష్ణ, యళ్ళ బాలరాం, పోల తిరుపతి తదితర గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
 

Back to Top