వైయ‌స్ఆర్‌సీపీ నేత చింతాడ రవికుమార్‌కు బెయిల్ 

శ్రీకాకుళం: అక్రమ కేసులో రిమాండ్‌లో ఉన్న వైఎస్సార్‌సీపీ ఆమదాలవలస సమన్వయకర్త చింతాడ రవికుమార్‌కు బెయిల్ లభించింది. సోమవారం ఆమదాల వలస కోర్టు చింతాడ రవికుమార్‌కు బెయిల్‌ మంజూరు చేసింది. చింతాడ రవికుమార్‌తో పాటు ఇతరులకు కూడా బెయిల్ లభించింది. బెయిల్ మంజూరుతో జైలు నుంచి చింతాడ విడుదలకు మార్గం సుగమమైంది. చింతాడ రవికుమార్‌కు బెయిల్ రావడంతో వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  

Back to Top