గడపగడపకు వైయస్ఆర్‌సీపీ.. 

ప్రజల సమస్యలు తెలుసుకున్న బోస్‌, సూర్యప్రకాష్‌

అంబేద్క‌ర్ కోన‌సీమ జిల్లా: రామచంద్రపురం టౌన్‌ 12వ వార్డు బ్రాడీపేటలో గడపగడపకు వైయస్ఆర్‌సీపీ  కార్యక్రమాన్ని  నిర్వహించారు. మాజీ రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, రామచంద్రపురం వైయస్సార్‌సీపీ కోఆర్డినేటర్‌ పిల్లి సూర్యప్రకాష్‌ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలను ఆప్యాయంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా బోస్‌, సూర్యప్రకాష్‌ ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానికంగా ఎదురవుతున్న ఇబ్బందులను తమ దృష్టికి తీసుకువచ్చిన ప్రజలకు వైయస్సార్‌సీపీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తుందని భరోసా కల్పించారు.

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా
ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కారం కోసం కృషి చేయడమే గడపగడపకు వైయస్సార్‌ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నాయకులు తెలిపారు. ప్రతి కుటుంబంతో మమేకమై వారి అవసరాలను తెలుసుకుంటూ ప్రజలకు అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. రాబోయే మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రజల ఆశీస్సులతో వైయస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలని పిల్లి సూర్యప్రకాష్‌ ప్రజలను కోరారు. వార్డుల అభివృద్ధితో పాటు స్థానిక సమస్యల పరిష్కారానికి బలమైన నాయకత్వాన్ని అందించేందుకు వైయస్సార్‌సీపీకి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. వైయస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
 

Back to Top