హైదరాబాద్: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు శుక్రవారం హైదరాబాద్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు బేగంపేట ఏయిర్‌పోర్టు వద్ద ఘన స్వాగతం లభించింది. నగరంలో భారీ ఊరేగింపుగా యువత ఆయన వెంట నడిచారు. హైదరాబాద్‌లోని జలవిహార్ గ్రాండ్ లాన్స్‌లో జరిగిన సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్‌ఆర్ ఆంజనేయులు కుమారుడు అనంత పినాక్ శర్మ వివాహ వేడుకకు శ్రీ వైయస్ జగన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులు స్నిగ్ధ, అనంత పినాక్ శర్మలను శ్రీ వైయస్ జగన్ ఆశీర్వదించారు. వారికి హృదయపూర్వక వివాహ శుభాకాంక్షలు తెలియజేసి, వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.