అక్రమ కేసులో అరెస్టైన చింతాడ రవికుమార్‌కు వైయ‌స్‌ జగన్‌ భరోసా

ధైర్యంగా ఉండాలని సూచన.. పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ

తాడేప‌ల్లి: వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ ఇంఛార్జ్‌ చింతాడ రవికుమార్‌ గురువారం కలిశారు. అక్రమ కేసులో అరెస్టై అనంతరం బెయిల్‌పై విడుదలైన రవికుమార్‌తో శ్రీ వైయ‌స్‌ జగన్‌ మాట్లాడి కేసుకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రవికుమార్‌కు ధైర్యం చెప్పారు.

రాజకీయంగా ఎన్ని ఇబ్బందులు, ఒత్తిళ్లు ఎదురైనా అధైర్యపడకుండా ధైర్యంగా ఉండాలని శ్రీ వైయ‌స్‌ జగన్‌ సూచించారు. పార్టీ శ్రేణులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వైయ‌స్ఆర్‌సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రవికుమార్‌కు పార్టీ నుంచి పూర్తి సహకారం ఉంటుందని, ఆయనకు అండగా నిలుస్తామని శ్రీ వైయ‌స్‌ జగన్‌ స్పష్టం చేశారు.
 

Back to Top