దయాసాగర్ రెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్‌కు హాజరైన వైయస్ జగన్ 

బెంగళూరు: చిత్తూరు జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ నేత దయాసాగర్ రెడ్డి కుమారుడు సుజిత్ వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి హాజరయ్యారు. బెంగళూరులో ఘనంగా నిర్వహించిన ఈ వేడుకలో నూతన వధూవరులు గౌతమి, సుజిత్‌లను శ్రీ వైయస్ జగన్ ప్రత్యేకంగా కలుసుకుని వివాహ శుభాకాంక్షలు తెలిపారు. వారి దాంపత్య జీవితం ఆనందమయం, ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండిపోవాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వదించారు.

ఈ సందర్భంగా దయాసాగర్ రెడ్డి కుటుంబ సభ్యులతో శ్రీ వైయస్ జగన్ ఆత్మీయంగా ముచ్చటించారు. వివాహ రిసెప్షన్‌కు హాజరైన పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అభిమానులు నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కుటుంబ సభ్యులు శ్రీ వైయస్ జగన్‌కు ఘన స్వాగతం పలికి, తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఆయన హాజరుతో వివాహ రిసెప్షన్ వేడుకకు మరింత ప్రత్యేకత చేకూరింది.
 

Back to Top