తాడేపల్లి: నంద్యాల జిల్లా బనగానపల్లె పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమగ్ర భూసర్వేపై చేసిన వ్యాఖ్యలను వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ తీవ్రంగా ఖండించారు. శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అత్యాధునిక సాంకేతికతతో ప్రారంభించి విజయవంతంగా అమలు చేసిన సమగ్ర భూసర్వేను కేవలం రంగు మార్చి తమ ఘనతగా ప్రచారం చేసుకోవడం ఇది కూటమి ప్రభుత్వం చేస్తున్న క్రెడిట్ చోరీ తప్ప మరొకటి కాదని మండిపడ్డారు. ఎన్నికల ముందు సమగ్ర భూసర్వేపై ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన కూటమి నాయకులు, అధికారంలోకి వచ్చిన తర్వాత అదే విధానాన్ని యథాతథంగా కొనసాగిస్తున్నారని విమర్శించారు. రైతులకు భూ హక్కుల రక్షణ కోసం వైయస్ జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలను రీబ్రాండింగ్ చేసి ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. తాడేపల్లిలో పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పుత్తా శివశంకర్ పలు అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీశారు. మీడియా సమావేశంలో పుత్తా శివశంకర్ ఇంకా ఏమన్నారంటే.. - రంగు మార్చి కొత్తగా చేశామని చెప్పడం ప్రజలను మోసం చేయడమే ఎన్నికల ముందు సమగ్ర భూసర్వే పేరుతో ప్రజలను భయపెట్టి, భూములు లాక్కుంటారని ప్రచారం చేసినవారే ఇప్పుడు అదే భూసర్వేను తమ ఘనతగా చెప్పుకుంటున్నారు. శ్రీ వైయస్ జగన్ గారి ప్రభుత్వం ఇచ్చిన పాసు పుస్తకాలలో ఉన్న క్యూఆర్ కోడ్, యూనిక్ నంబర్, వెబ్‌సైట్, డిజిటల్ భద్రతా ఫీచర్లన్నీ అలాగే ఉంచి కేవలం కవర్ రంగు మార్చి కొత్తగా చేశామని చెప్పడం ప్రజలను మోసం చేయడమే. - రైతుల భూ హక్కులకు పునాది వేసింది వైయస్ జగన్ ప్రభుత్వమే వంద ఏళ్ల తర్వాత రాష్ట్రంలో సమగ్ర భూసర్వే ప్రారంభించిన ఘనత వైయస్ జగన్ ప్రభుత్వానిది. సర్వే ఆఫ్ ఇండియాతో ఒప్పందం చేసుకుని అత్యాధునిక సాంకేతికతతో భూసర్వే చేపట్టారు. 70కుపైగా CORS స్టేషన్లు, 3,640 GNSS రిసీవర్లు, జీపీఎస్ హై యాక్యురసీ సిస్టమ్స్, 2 విమనాలు, నాలుగు హెలికాప్టర్లు, 200కుపైగా హై ఎండ్ డ్రోన్లతో సర్వే నిర్వహించారు. 40 వేల మందికి 70 సార్లకు పైగా శిక్షణ ఇచ్చి గ్రామ స్థాయిలో భూ సమస్యలను పరిష్కరించే వ్యవస్థను ఏర్పాటు చేశారు. డ్రోన్ సర్వే, ఓఆర్ఐ మ్యాపింగ్, డిజిటల్ భూ రికార్డులు, ఉచిత సర్వే రాళ్లు, రైతులకు శాశ్వత భూ హక్కుల రక్షణ వంటి సంస్కరణలన్నీ జగన్ ప్రభుత్వ హయాంలోనే అమలయ్యాయి. దీనిని దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకున్నాయి. క్యూఆర్ కోడ్ నుంచి యూనిక్ నంబర్ వరకు జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవస్థనే యథాతథంగా కొనసాగిస్తున్నారు. ఎన్నికల ముందు రద్దు చేస్తామని చెప్పి, ఇప్పుడు అదే విధానాన్ని అమలు చేస్తూ క్రెడిట్ కొట్టేయాలని చూడటం ప్రజలను మోసం చేసే ఈ ప్రయత్నాన్ని రైతులు గమనిస్తున్నారు. - 22ఏ సమస్యలను మళ్లీ తెరపైకి తెచ్చింది కూటమి ప్రభుత్వం 22ఏ భూముల సమస్యలను పరిష్కరించి హక్కుదారులకు న్యాయం చేసింది వైయస్ జగన్ ప్రభుత్వమే. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ వాటిని నిషేధ జాబితాలో పెట్టి రైతులను ఇబ్బందులకు గురి చేసింది. ఈరోజు ప్రజా ఫిర్యాదుల్లో అత్యధికం రెవెన్యూ, భూముల సమస్యలే ఉండటం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. రైతుల సమస్యలను పరిష్కరించకుండా కొత్త కొత్త సమస్యలు సృష్టించి గందరగోళం చేస్తున్నారు. రైతుల భూ హక్కులను కాపాడే విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే పెండింగ్ సమస్యలను పరిష్కరించాలి. - ప్రభుత్వ కార్యక్రమాలు రాజకీయ వేదికలుగా మారాయి ప్రతి నెల ఏదో ఒక జిల్లాకు వెళ్లే చంద్రబాబు..ప్రభుత్వ కార్యక్రమాల గురించి మాట్లాడకుండా ప్రతిపక్షాలపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారు. ప్రజలకు కొత్తగా ప్రకటించే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు లేకపోవడంతో రాజకీయ ప్రసంగాలకే పరిమితమవుతున్నారు. సాయికృష్ణ, గంగమ్మ, తిరుపతమ్మ, క్రాంతికుమార్ వంటి ఘటనలపై సమాధానం చెప్పకుండా యూట్యూబర్ రావణ్ అంశాన్ని అడ్డం పెట్టుకుని ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడం మానేసి క్రెడిట్ చోరీ, రాజకీయ ప్రచారమే ప్రభుత్వ లక్ష్యంగా మారింది. సమగ్ర భూసర్వేకు పునాది వేసింది వైయస్ జగన్ ప్రభుత్వం. దానికి రంగు మార్చి రీబ్రాండింగ్ చేయడం ద్వారా ప్రజలను మోసం చేయాలని చూస్తున్నా, రైతులు నిజాలను గుర్తుంచుకుంటారు. ఎంత ప్రచారం చేసినా క్రెడిట్ జగన్ ప్రభుత్వానిదే, రీబ్రాండింగ్ చంద్రబాబు ప్రభుత్వానిదే అని పుత్తా శివశంకర్ స్పష్టం చేశారు.