వైయస్‌ జగన్‌ శ్రీకాకుళం జిల్లా పర్యటనను విజయవంతం చేయండి

వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర క్రమశిక్షణా కమిటీ సభ్యురాలు, మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి పిలుపు

పాతపట్నం: వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకాకుళం జిల్లా పర్యటనను పార్టీ శ్రేణులంతా విజయవంతం చేయాలని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర క్రమశిక్షణా కమిటీ సభ్యురాలు, మాజీ ఎమ్మెల్యే శ్రీమతి రెడ్డి శాంతి పిలుపునిచ్చారు. పాతపట్నంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. నియోజకవర్గంలోని వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ విభాగాల ప్రతినిధులు, అభిమానులు అత్యధిక సంఖ్యలో తరలివచ్చి వైయస్‌ జగన్‌కు ఘన స్వాగతం పలకాలని కోరారు.

అక్రమ కేసులో అరెస్టై ప్రస్తుతం అంపోలు జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న మాజీ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజును శ్రీ వైయస్‌ జగన్‌ పరామర్శించి, ములాఖత్‌లో మాట్లాడనున్నారని తెలిపారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న ‘రెడ్‌బుక్‌ రాజ్యాంగం’లో భాగంగానే రాజకీయ కక్షతో డాక్టర్‌ సీదిరి అప్పలరాజుపై అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేశారని రెడ్డి శాంతి మండిపడ్డారు. రాజకీయ వేధింపులకు గురవుతున్న పార్టీ నాయకులకు శ్రీ వైయస్‌ జగన్‌, వైయ‌స్ఆర్‌సీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

Back to Top