విశాఖ: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఉత్తరాంధ్ర పర్యటనకు అపూర్వ ప్రజాదరణ లభిస్తోంది. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వైపు రోడ్డు మార్గంలో కొనసాగుతున్న ఆయన పర్యటనలో దారి పొడవునా వేలాదిగా ప్రజలు తరలివచ్చి ఘన స్వాగతం పలుకుతున్నారు. తగరపువలస దాటి సంగివలస చేరుకున్న వైఎస్ జగన్‌కు అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. పోలీసుల ఆంక్షలను లెక్కచేయకుండా ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఓ చిన్నారిని వైయస్ జగన్ ఎత్తుకుని ఆప్యాయంగా ముద్దాడారు. ఆ దృశ్యం అక్కడున్న వారిని విశేషంగా ఆకట్టుకుంది. ప్రజలకు చేతులెత్తి అభివాదం చేస్తూ, అభిమానుల అభివాదాలకు ప్రతిస్పందిస్తూ వైఎస్ జగన్ ముందుకు సాగారు. విశాఖ నుంచి శ్రీకాకుళం వరకు కనిపిస్తున్న అపూర్వ జనస్పందన ఉత్తరాంధ్ర ప్రజల్లో వైఎస్ జగన్‌పై ఉన్న ఆదరణకు నిదర్శనంగా నిలిచిందని వైయస్ఆర్‌సీపీ పేర్కొంది.