నందలూరు సౌమ్యనాథుడి రథోత్సవంలో ఎమ్మెల్యే ఆకేపాటి

వైయస్‌ జగన్‌కు సౌమ్యనాథుడి ఆశీస్సులు మెండుగా ఉండాలని ప్రార్థన 

వైయస్సార్ జిల్లా: నందలూరు సౌమ్యనాథ స్వామి ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన స్వామివారి రథోత్సవం కోలాహలంగా సాగింది. ర‌థోత్సవంలో ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి పాల్గొని సౌమ్యనాథ స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు.

రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో సుభిక్షంగా వర్ధిల్లాలని స్వామివారిని ప్రార్థించారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి సౌమ్యనాథ స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
 

Back to Top