భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష

తాడేపల్లి : వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు శ్రీమతి బొత్స అనూషను భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. ఈ మేరకు వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయం సెప్టెంబర్ 18, 2026న అధికారికంగా పార్టీ ప్రకటన విడుదల చేసింది.

భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూషకు బాధ్యతలు అప్పగిస్తూ పార్టీ అధ్యక్షుల ఆదేశాలతో ఈ నియామకం జరిగింది. నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాల సమన్వయం, నాయకులు, కార్యకర్తలతో కలిసి పార్టీ కార్యకలాపాలను ముందుకు తీసుకెళ్లడంలో ఆమెకు కీలక బాధ్యతలు అప్పగించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయ ప్రకటనలో పేర్కొంది.

Back to Top