తాడేపల్లి : వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర పార్టీ కమిటీలో ఇద్దరికి కీలక బాధ్యతలు అప్పగిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి గారి ఆదేశాల మేరకు పెందుర్తి నియోజకవర్గానికి చెందిన పైలా సన్యాసిరాజును రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా నియమించారు. ఆయన అనకాపల్లి జిల్లాకు ప్రాతినిధ్యం వహించనున్నారు. అదేవిధంగా విశాఖపట్నం తూర్పు నియోజకవర్గానికి చెందిన వేంపాడ శ్రీనివాసరెడ్డిని రాష్ట్ర కార్యదర్శి (పార్లమెంట్)గా నియమించారు. ఆయన విశాఖపట్నం జిల్లాకు ప్రాతినిధ్యం వహించనున్నారు. పార్టీ రాష్ట్ర కమిటీలో వీరికి బాధ్యతలు అప్పగిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.