ఆళ్ల అయోధ్యరామిరెడ్డి కుమారుడి నిశ్చితార్థ వేడుకకు వైయస్‌ జగన్‌

 నీనా–ఇషాన్‌లను ఆశీర్వదించిన వైయస్‌ జగన్‌ దంపతులు

బెంగళూరు: మాజీ ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి కుమారుడు ఇషాన్‌ వివాహ నిశ్చితార్థ వేడుకకు మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, శ్రీమతి వైయస్‌ భారతి దంపతులు హాజరయ్యారు. బెంగళూరులో జరిగిన ఈ వేడుకలో నూతన వధూవరులు నీనా–ఇషాన్‌లను వైయస్‌ జగన్‌ దంపతులు ఆప్యాయంగా ఆశీర్వదించి, హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో, ఆనందంగా సాగాలని ఆకాంక్షించారు.

ఈ శుభకార్యానికి వైయ‌స్ఆర్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి దంపతులతో పాటు పలువురు వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు, ఆత్మీయుల సమక్షంలో నిశ్చితార్థ వేడుక సందడిగా జరిగింది.  

Back to Top