వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తకు ఆర్థిక సాయం

వైయస్‌ జగన్‌ ఆదేశాల మేరకు రూ.75 వేల సాయం

ఆర్థిక సాయం అందించిన వైయ‌స్ఆర్‌సీపీ బెంగళూరు ఐటీ వింగ్‌

ఇటీవల గుండె శస్త్రచికిత్స చేయించుకున్న వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్త సవీంద్ర రెడ్డికి పార్టీ బెంగళూరు ఐటీ వింగ్‌ ఆర్థిక సాయం అందించింది.

వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ ఆదేశాల మేరకు రూ.75 వేల చెక్కును తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, లీగల్‌ సెల్‌ అధ్యక్షుడు మనోహర్‌ రెడ్డి సవీంద్ర రెడ్డికి అందజేశారు. తన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని ఆర్థికంగా అండగా నిలిచేలా చర్యలు తీసుకున్న శ్రీ వైయస్‌ జగన్‌కు, సహాయం అందించిన వైఎస్సార్‌సీపీ బెంగళూరు ఐటీ వింగ్‌కు సవీంద్ర రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

Back to Top