రేపల్లె: వైయస్ఆర్‌సీపీ రేపల్లె నియోజకవర్గ ఇన్‌చార్జి పీటా మోహన్ ఆదేశాల మేరకు, రేపల్లె పట్టణ కన్వీనర్ కరేటి శేషగిరిరావు ఆధ్వర్యంలో 26వ వార్డులో ఇంటింటి కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా 26వ వార్డు ఇన్‌చార్జి షేక్ అబ్దుల్ ఖుద్దూస్ వార్డులోని ఇళ్లను సందర్శించి ప్రజలను కలిశారు. గత ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, వాటి ద్వారా ప్రజలకు అందిన ప్రయోజనాలను వివరిస్తూ రూపొందించిన కరపత్రాలను పంపిణీ చేశారు. అదేవిధంగా ప్రస్తుత ప్రభుత్వం అమలు చేయని లేదా కొనసాగింపుపై స్పష్టత లేని పథకాలకు సంబంధించిన వివరాలను కూడా కరపత్రాల ద్వారా ప్రజలకు వివరించారు. ప్రజల నుంచి స్థానిక సమస్యలు, సంక్షేమ పథకాలపై అభిప్రాయాలను తెలుసుకున్నారు. వార్డు పరిధిలో ప్రజలతో నేరుగా మమేకమై వారి సమస్యలను తెలుసుకోవడం, సంక్షేమ పథకాల వివరాలను ప్రజలకు చేరవేయడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పార్టీ శ్రేణులు తెలిపారు. కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, వార్డు శ్రేణులు పాల్గొన్నారు.