ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే వైయస్. జగన్‌పై వ్యక్తిగత దాడులు.

వైయస్.జగన్, విజయమ్మపై చంద్రబాబు అభ్యంతరకర వ్యాఖ్యలు

కుటుంబ సభ్యులపై నీచంగా మాట్లాడ్డం బాబు సంస్కారహీనతకు నిదర్శనం

చంద్రబాబు వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి కురసాల కన్నబాబు

కాకినాడ లోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి కురసాల కన్నబాబు

అమరావతి నిర్మాణాల్లో చదరపు అడుగుకు రూ.20 వేల ఖర్చు

అసాధారణ అవినీతికి తెరలేపిన చంద్రబాబు ప్రభుత్వం

రాష్ట్రంలో కుప్పకూలిన శాంతిభద్రతలు

ప్రశ్నించే వారిపై ఉపా (UAPA) లాంటి తప్పుడు చట్టాలు 

కూటమి తీరుపై మాజీ మంత్రి కన్నబాబు ఆక్షేపణ

యువకులను చంపి బూడిద చేస్తున్న తెలుగుదేశం పార్టీనే నిజమైన ‘బూడిద పార్టీ’.

ప్రజా సమస్యలపై సమాధానం చెప్పలేకే చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ 

రూ.5 వేల కోట్ల రామాయపట్నం పోర్టును కేవలం రూ.1500 కోట్లకే కార్పొరేట్లకు అమ్మకం

వైయస్. జగన్ హాయంలో మెడికల్ కాలేజీలు, పోర్టులు, షిఫింగ్ హార్భర్ల నిర్మాణం

అడ్డగోలుగా ప్రైవేటు పరం చేస్తున్న కూటమి ప్రభుత్వం

‘ఆంధ్రప్రదేశ్ అమ్మకానికి’ పెడుతున్న చంద్రబాబు

కూటమి ప్రభుత్వంపై  మాజీ మంత్రి కురసాల కన్నబాబు ధ్వజం

కాకినాడ: కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికొదిలేసి, తమ పాలనా వైఫల్యాలు, అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ను ఒక విలన్‌లా చూపిస్తూ వ్యక్తిగత దూషణలకు దిగుతోందని మాజీ మంత్రి కురసాల కన్నబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చివరకు కుటుంబ సభ్యులపైనా నీచమైన కామెంట్స్ చేసే స్థాయికి దిగజారారని మండిపడ్డారు. కాకినాడలోని తన క్యాంపు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధిని బూడిద చేసిన చంద్రబాబు ప్రభుత్వం, ప్రజల దృష్టిని మళ్లించేందుకు 'డైవర్షన్ పాలిటిక్స్' కు తెరలేపిందని స్పష్టం చేశారు. రూ.5 వేల కోట్ల విలువైన రామాయపట్నం ప్రభుత్వ పోర్టును కేవలం రూ.1500 కోట్లకే కార్పొరేట్లకు కట్టబెట్టడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. ప్రభుత్వ ఆస్తులను, పోర్టులను, మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు అడ్డగోలుగా అప్పగిస్తూ ఆంధ్రప్రదేశ్‌ను అమ్మకానికి పెట్టే పరిస్థితి తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే..

- ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించేందుకే దుష్ప్రచారం..

ప్రజలకు తాము చేసిన మేలు ఏమీ చెప్పుకోలేకే చంద్రబాబు, ఆయన కూటమి ప్రభుత్వం నిత్యం వైఎస్ జగన్‌ను, వైఎస్సార్‌సీపీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. ఐదేళ్లలో తాము మెరుగైన సుపరిపాలన అందించామని చెప్పుకునే పరిస్థితి లేక, వైఎస్సార్‌సీపీని ఒక విలన్‌లా చూపేందుకు కుయుక్తులు పన్నుతున్నారు. చివరకు చంద్రబాబు తన వయస్సును సైతం మర్చిపోయి జగన్‌పై వ్యక్తిగత దూషణలకు దిగడం అత్యంత విచారకరం.

- తల్లి, కుమారుడి బంధంపై అంత నీచంగా మాట్లాడటం మీ సంస్కారమా?

వైఎస్సార్ జయంతి సందర్భంగా వైఎస్సార్ ఘాట్ వద్ద తల్లి విజయమ్మ తన కుమారుడు జగన్‌ను హత్తుకుని ముద్దుపెట్టుకుంటే.. దానిపై కూడా బహిరంగసభలో చంద్రబాబు ఎంతలా దిగజారి మాట్లాడారో రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ‘ఓట్ల కోసం తండ్రికి పూజలు చేస్తున్నాడు, తల్లిని గౌరవించలేని వ్యక్తి’ అంటూ అత్యంత నీచంగా మాట్లాడుతున్నారు. 17 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి, సుదీర్ఘ కాలం ఒక పార్టీని నడుపుతున్న చంద్రబాబు భాష, వ్యవహారశైలి చూస్తుంటే ఆయనకు ఎందుకు అంత తీవ్రమైన ఫ్రస్ట్రేషన్ కనిపిస్తోందో అర్ధం కావడం లేదు.

- మీది 'బూడిద పార్టీ'.. లేదా 'యూజ్ అండ్ త్రో' పార్టీ..

"మా పార్టీని 'గొడ్డలి పార్టీ' అని పదే పదే మాట్లాడుతున్న చంద్రబాబుకు నేను సూటిగా ప్రశ్నిస్తున్నా.. మీది అసలు ఏ పార్టీ? మీది 'బూడిద పార్టీ'. ఎందుకంటే పోలీస్ స్టేషన్లలో యువకులను అత్యంత దారుణంగా చంపి, శవాలను కాల్చి బూడిద చేస్తున్నారు. రాష్ట్ర వనరులన్నింటినీ కార్పొరేట్లకు దోచిపెట్టి, రాష్ట్ర భవిష్యత్తును బూడిద చేస్తున్నారు. అవసరం ఉన్నప్పుడు వాడుకుని, అవసరం తీరాక వదిలేసే మీ సహజ ధోరణి చూస్తుంటే మిమ్మల్ని 'యూజ్ అండ్ త్రో' పార్టీ అనాలి. వెన్నుపోటు రాజకీయాలతో వచ్చిన మీది అసలు ఒరిజనల్ టీడీపీ కాదని నాడే ఎన్టీఆర్ స్వయంగా చెప్పారు.

- రూ.5 వేల కోట్ల పోర్టును రూ.1500 కోట్లకే కట్టబెడుతున్నారు..

ఎన్నికల ముందు సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు కార్పొరేట్లు, తన బంధుమిత్రుల కోసమే సంపద సృష్టిస్తున్నారు. వైఎస్ జగన్ హయాంలో సుమారు రూ.5 వేల కోట్లతో 95 శాతం పనులు పూర్తి చేసిన రామాయపట్నం పోర్టును కేవలం రూ.1500 కోట్లకే 50 సంవత్సరాలకు ప్రైవేటుకు కట్టబెడుతున్నారు. పోర్టు నిర్మాణ అప్పు రూ.2079 కోట్లు ప్రభుత్వమే తీర్చాలి, మిగిలిన 5 శాతం పనులూ ప్రభుత్వమే చేయాలి, పైగా అదనంగా భూమిని ఎకరం కేవలం రూపాయికే కేటాయించాలి. ఇదెక్కడి సంపద సృష్టి? వైఎస్ జగన్ విజన్‌తో కట్టిన 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను, పోర్టులను చంద్రబాబు ప్రైవేటు పరం చేయాలని చూస్తున్నారు.

- అమరావతిలో అసాధారణ భవనాలు కాదు.. అసాధారణ అవినీతి..

కేంద్ర ప్రభుత్వం అమరావతిలో చదరపు అడుగు నిర్మాణానికి రూ.3450 ఖరారు చేస్తే, ఈ కూటమి ప్రభుత్వం చదరపు అడుగుకు రూ.20 వేల వరకు ఖర్చు అవుతుందని సమీక్షలు చేస్తోంది. హైదరాబాద్‌లో అత్యంత ఖరీదైన కోకాపేట ప్రాంతంలోనే అన్ని సౌకర్యాలతో రూ.8-10 వేలకే ప్రైవేటు వ్యక్తులు విక్రయిస్తుంటే, అమరావతిలో రూ.20 వేలు ఎందుకు అవుతుందో సమాధానం చెప్పాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన రేటుకు, వీరు చూపిస్తున్న రేటుకు చదరపు అడుగుకు రూ.10 వేల తేడా ఉందంటే ఇది అసాధారణమైన అవినీతి కాదా?"

- అడుగడుగునా వైఫల్యాలు.. కుప్పకూలిన శాంతిభద్రతలు..

రాష్ట్రంలో శాంతిభద్రతలను పూర్తిగా గాలికొదిలేశారు. విజయవాడలో లాకప్ డెత్ అయిన సాయికృష్ణ తల్లి 'నా కొడుకు బూడిదైనా ఇవ్వండి' అని అడుగుతున్నా సమాధానం లేదు. తునిలో తప్పిపోయిన చిన్నారి కోసం తల్లిదండ్రులు ఆర్టీసీ బస్సుల వెనుక పోస్టర్లు అంటించుకుంటున్నా స్పందన లేదు. విశాఖ సముద్రంలో మత్స్యకారులు గల్లంతైతే ఆచూకీ చెప్పలేకపోయారు. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు, వేధింపులు చేస్తున్నారు.
కుప్పకూలిన శాంతిభద్రతలకి సమాధానం చెప్పలేక డైవర్షన్ పాలిటిక్స్ ఏ స్థాయికి తెచ్చారంటే.. రావణ్ అనే యూట్యూబర్ మీద యూఏపీఏ(ఉపా) అనే ఉగ్రవాదులను నియంత్రించే చట్టాన్ని  పెట్టారు. ఇప్పుడు రాష్ట్రంలో ఎవరు మాట్లాడినా, ఏం మాట్లాడినా దాని వెనుక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉందని దుష్ప్రచారం చేస్తున్నారు.  మీరు పెట్టిన కేసుల్లో చట్టాన్ని అతిక్రమించి పెట్టాల్సిన సెక్షన్లు, కేసులు కాకుండా  వేరే చట్టాలని ప్రయోగించడానికి మేం వ్యతిరేకం. మీరు ఎవరిమీద అలా అక్రమ కేసులు పెట్టినా ప్రతిపక్ష పార్టీగా మేం గొంతెత్తి ప్రశ్నిస్తాం. ప్రభుత్వం కేసులు పెట్టిన యూట్యూబర్ రావణ్ గతంలో కూడా వైయస్.జగన్ ని విపరీతంగా దూషించాడు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ని దూషించాడు. వైయస్.జగన్ ని తిట్టినా ఆయన వైయస్.జగన్ మనిషి అని ప్రచారం చేస్తారు. ఏదో ఒక ఛానెల్ లో రావణ్ ని ఇంటర్వ్యూ చేస్తూ.. మీరు చంద్రబాబుని, లోకేష్ ని ఎందుకు తిట్టరు అని ప్రశ్నిస్తే దాని సమాధానంగా ఆయన నవ్వుతున్నాడు. వైయస్.జగన్ ని తిడితే, పవన్ కళ్యాణ్ ని తిడితే మీరు ఇంత కాలం ఆయన తప్పులను ఎందుకు కనుక్కోలేకపోయారు. మేం ఎప్పుడూ ఆ భాషను సమర్థించలేదు, కానీ ప్రభుత్వం అణచివేత ధోరణితో తప్పుడు చట్టాలను ప్రయోగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. పోలీసుల వ్యవహారశైలిని ఏబీ వెంకటేశ్వరరావు లాంటి రిటైర్డ్ అధికారి సైతం తప్పుపడుతున్నారు.

- ఇచ్చిన హామీలన్నీ బూడిద.. ప్రజలు త్వరలోనే తేలుస్తారు..

వైఎస్ జగన్ హయాంలో నాడు-నేడు, రైతు భరోసా, సున్నా వడ్డీ, చేయూత, ఆసరా వంటి పథకాలతో మహిళలను, రైతులను ఆదుకున్నారు. వైయస్.జగన్ హాయంలో ఇచ్చిన పాస్ బుక్ లకి, ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే పాస్ బుక్ లో తేడా ఏముంది? ఆ రోజు మోస్ట్ అడ్వాన్స్‌డు టెక్నాలజీతో వైయస్.జగన్ పాస్ బుక్కులు ఇప్పించే కార్యక్రమం చేశారు.. ఇప్పటికీ అదే జరుగుతుంది. రియల్ టైమ్ అలర్ట్, భూమి రికార్డుల్లో మార్పు జరిగితే భూహక్కుదారుడికి మెసేజ్ వచ్చే వరకు వైయస్.జగన్ ఎన్నో చర్యలు తీసుకున్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకుని రీ సర్వే చేస్తే అత్యంత దారుణంగా విషం చిమ్మారు. 
వైయస్.జగన్ తీసుకొచ్చిన సంస్కరణలను నీతి ఆయోగ్ సైతం ప్రశంసించింది. కేరళ లాంటి రాష్ట్రాలు, ఉత్తరాఖండ్ నుంచి వచ్చి చూసి ప్రశంసించి ఇదే అమలు చేస్తామని చెప్పారు. అస్సాం లాంటి రాష్ట్రాలు దీన్ని అమలు చేయడానికి సహకరించమని చెప్పారు. 
కానీ చంద్రబాబు అబద్దం మందు గొప్ప ప్రణాళిక, గొప్ప కార్యక్రమం నివ్వెర పోయింది. వైయస్.జగన్ చేసిన గొప్పపనిని తప్పుడు పనిగా క్రియేటే చేశారు .ఇప్పుడు మీరు మళ్లీ అదే పని చేస్తూ.. దేశంలో ఎక్కడా లేని విదంగా నేను మార్పులు, సంస్కరణలు చేశానని నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నారు. 

ఇవాళ స్కూళ్లు తెరిచి నెల రోజులైనా యూనిఫామ్‌లు, పుస్తకాలు, బ్యాగులు ఇవ్వలేదు. 'ఆడబిడ్డ నిధి' ఏమైందో చెప్పరు. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలను చాపచుట్టేస్తున్నారని కన్నబాబు తేల్చి చెప్పారు. అధికారం చేతిలో ఉందని, ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదనే బరితెగింపుతో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని... ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ను ఎంతగా దూషించినా, మాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టి వేధించినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీగా మేం ప్రజా సమస్యలపై పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేసారు. సంక్షేమాన్ని, అభివృద్ధిని బూడిద చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ను కార్పొరేట్లకు అమ్మకానికి పెడుతున్న చంద్రబాబు ప్రభుత్వ పాపాలను రానున్న రోజుల్లో ప్రజలే స్వయంగా తేలుస్తారని కన్నబాబు కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Back to Top