కావలి: గిరిజన మహిళపై జరిగిన ఘటనలో బాధితురాలికి అండగా వైయస్ఆర్‌సీపీ నిలిచింది. పార్టీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత బాధితురాలిని పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకుని, బాధిత కుటుంబానికి పార్టీ తరఫున పూర్తి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కాకాణి పూజిత మాట్లాడుతూ, కావలి నియోజకవర్గ వైయస్ఆర్‌సీపీ ఇన్‌చార్జి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి అండగా నిలవకపోయి ఉంటే ఈ కేసు కనుమరుగై ఉండేదని అన్నారు. ప్రజలకు ఎలాంటి అన్యాయం జరిగినా మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎప్పుడూ అందుబాటులో ఉంటూ బాధితులకు న్యాయం జరిగేలా పోరాడుతున్నారని కొనియాడారు. ఈ కేసును నీరుగార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించిన కాకాణి పూజిత, బాధిత గిరిజన మహిళకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వరకు వైయస్ఆర్‌సీపీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధితురాలికి పూర్తి న్యాయం జరగకపోతే వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని కాకాణి పూజిత ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రజల పక్షాన వైయస్ఆర్‌సీపీ ఎప్పుడూ ముందుంటుందని, బాధితులకు న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు.