వైయ‌స్ఆర్‌ ఘాట్‌ వద్ద వైయ‌స్‌ జగన్‌ నివాళులు 

వైయ‌స్ఆర్‌ జిల్లా: దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా మాజీ సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ‌ కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపులపాయలోని వైయ‌స్ఆర్‌ ఘాట్‌లో ఘనంగా నివాళులు అర్పించారు.  మత పెద్దలు నిర్వహించే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.

సంక్షేమ ప్రదాత.. అభివృద్ధి విధాత.. మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ రాజశేఖర్‌రెడ్డి 16వ వర్ధంతి నేడు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యుల‌తో క‌లిసి వైయస్ జ‌గ‌న్‌ ఇడుపులపాయలోని వైయ‌స్ఆర్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించారు. వైయ‌స్ఆర్‌ సతీమణి విజయమ్మ, తనయుడు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి, వైయ‌స్‌ భారతి, ఇతర కుటుంబ సభ్యులు, వైయ‌స్ఆర్‌సీపీ నేతలు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని మహానేతను స్మరించుకున్నారు.


వైయ‌స్ఆర్‌కు వైయ‌స్ఆర్‌సీపీ నాయకుల నివాళులు
ఇడుపుల పాయ వైయ‌స్ఆర్‌ ఘాట్ వద్ద దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ నాయకులు నివాళులర్పించారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి, మాజీ డిప్యూటి సీఎంలు నారాయణ స్వామి, అంజాద్ బాషా , మాజీ మంత్రి ఉష శ్రీ చరణ్,  ఎమ్మెల్యే ఆకెపాటి అమర్ నాథ్ రెడ్డి, వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రవీంద్ర నాథ్ రెడ్డి,  గడికోట శ్రీకాంత్ రెడ్డి, రఘు రామ్ రెడ్డి, బియ్యపు మధుసూదన్ రెడ్డి, కోరుముట్ల శ్రీనివాసులు తదితరులు వైయ‌స్ఆర్‌కు నివాళులర్పించారు.

Back to Top