ప్రొద్దుటూరులో ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ నిరసన..

నల్ల కండువాలతో వైయ‌స్ఆర్‌సీపీ ఆందోళన 

 ప్రొద్దుటూరు : చంద్రబాబు పాలన రెండేళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రజలకు జరిగిన అన్యాయాలు, నెరవేరని హామీలను నిరసిస్తూ వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ప్రొద్దుటూరులో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు నల్ల కండువాలు ధరించి నిరసన తెలిపారు. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో చంద్రబాబు ప్రభుత్వ రెండేళ్ల పాలనలో ప్రజలకు జరిగిన నష్టాలు, వివిధ వర్గాలకు ఇచ్చిన హామీల అమలులో జరిగిన వైఫల్యాలను ప్రస్తావిస్తూ ఫోటో ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా  రాచ‌మ‌ల్లు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. రైతులు, యువత, మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు సహా అన్ని వర్గాలు నిరాశకు గురయ్యాయని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలకు జరిగిన ‘వెన్నుపోటు’ను ప్రజలకు వివరించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని పేర్కొంటూ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం వైయ‌స్ఆర్‌సీపీ పోరాటం కొనసాగుతుందని నాయకులు స్పష్టం చేశారు.
 

Back to Top