మేక‌పాటి గౌతమ్‌రెడ్డికి ఘ‌న నివాళులు

నెల్లూరు జిల్లా: దివంగత రాష్ట్ర మంత్రి  మేక‌పాటి గౌత‌మ్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆత్మకూరు పట్టణంలో ఘన నివాళులర్పించారు. పట్టణంలోని మేకపాటి గౌత‌మ్‌రెడ్డి మెమోరియ‌ల్ బ‌స్‌స్టాండ్ కాంప్లెక్స్ ఆవ‌ర‌ణ‌లో  ఏర్పాటు చేసిన ఆయన విగ్రహానికి  వైయ‌స్ఆర్‌సీపీ నేతలు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం బస్టాండ్ ఆవరణలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

పార్టీ పరిశీలకులు పేర్నాటి కోటేశ్వర రెడ్డి, వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షులు, మాజీ జడ్పీటీసీ సభ్యులు, ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ చిల్లూరు ఆదిశేషయ్య, రాష్ట్ర మున్సిపల్ విభాగం జనరల్ సెక్రటరీ అల్లారెడ్డి ఆనంద్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు నాగులపాటి ప్రతాప్ రెడ్డి, యువ నాయకుడు నోటి వినయ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.

అలాగే జడ్పీటీసీ సభ్యులు పెమ్మసాని ప్రసన్నలక్ష్మి, ఎంపీపీ బోయిళ్ళ పద్మజా రెడ్డి, మర్రిపాడు మండల కన్వీనర్ చెన్ను వెంకటేశ్వర్లు రెడ్డి, గంగవరపు శ్రీనివాసులు నాయుడు తదితరులు కార్యక్రమంలో పాల్గొని గౌతమ్ రెడ్డి సేవలను కొనియాడారు.
 

Back to Top