తాడేపల్లి, మే 20: వైయస్ఆర్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు రేపు (21.05.2026, గురువారం) ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న సమకాలీన రాజకీయ పరిణామాలు, ప్రజా సమస్యలు, ప్రభుత్వ విధానాలు తదితర అంశాలపై ఆయన మీడియాతో మాట్లాడనున్నారు. పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, మీడియా ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.