రౌడీ షీటర్ అయినంత మాత్రాన పోలీసులు చంపేస్తారా ?

సాయికృష్ణ హత్యపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్డితో విచారణ

మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని)డిమాండ్ 

తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి, కృష్ణాజిల్లా పార్టీ అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య(నాని) 

అమర్నాథ్ వ్యాఖ్యలపై ఎందుకింత రచ్చ ?

ఆయన మేకప్ గురించి మాత్రమే మాట్లాడారు

పవన్ మాత్రం కట్టూబొట్టూ డైలాగులు చెప్తున్నారు

అద్దాల మేడలో ఉంటూ రాళ్లేస్తే రాళ్లే పడతాయి

పేర్ని నాని స్పష్టీకరణ

నిత్యం సభ్యత లేకుండా హోంమంత్రి విమర్శలు

వైయ‌స్ఆర్‌సీపీని తిట్టడానికే అనిత పనికొస్తున్నారు

గతంలో భారతమ్మ, విజయమ్మపై నీచపు వ్యాఖ్యలు

రోజాపై పవన్ , టీడీపీ నేత బండారు వ్యాఖ్యలేంటి ?

పేర్ని నాని సూటి ప్రశ్న

సాయికృష్ణది పోలీసులు చేసిన హత్యే

కొడుకు ఆచూకీ తెలియక తల్లి వ్యథ

పోలీసుల చుట్టూ తిరిగినా ఫలితం శూన్యం

శవం కూడా దొరక్కుండా కాల్చేశారు

పేర్ని నాని ధ్వజం 

పోలీసులే చంపేస్తే ఇక కోర్టులెందుకు ?

చనిపోయిన సాయికృష్ణపై దుష్ప్రచారాలు

ఎన్నికల్లో వాడుకున్నప్పుడు ఇవన్నీ గుర్తులేదా ?

సిట్టింగ్ జడ్డి లేదా సీబీఐ దర్యాప్తు చేయించాల్సిందే

తేల్చిచెప్పిన పేర్ని నాని 

తాడేపల్లి: విజయవాడలో క్షీణించిన శాంతిభద్రతలకు విజయవాడలో పోలీసుల చేతిలో హత్యకు గురైన సాయికృష్ణ ఉదంతమే నిదర్శనమని వైయ‌స్ఆర్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) మండిపడ్డారు. పోలీసులే ఎత్తుకొచ్చి,చంపేసి, శవం కూడా దొరక్కుండా కాల్చేస్తే.. ఇక చట్టం ఎందుకు ? కోర్టులెందుకని పేర్ని నాని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సాయికృష్ణ హత్యపై సిట్టింగ్ జడ్డి లేదా సీబీఐ దర్యాప్తు జరిపించాలని ప్రభుత్వాన్ని పేర్ని నాని డిమాండ్ చేశారు. మరోవైపు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ హోంమంత్రి అనితను కించ పరిచేలా మాట్లాడారంటూ కూటమి నేతలు చేస్తున్న ప్రచారాలపై పేర్ని నాని ఫైర్ అయ్యారు. హోంమంత్రి అనిత గతంలో వైయ‌స్ఆర్‌సీపీ నేతలపై, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో మహిళలపై చేసిన వ్యాఖ్యల్ని గుర్తుచేసుకోవాలని హితవు పలికారు. 
ప్రెస్ మీట్లో పేర్ని నాని ఇంకేమన్నారంటే..
 
అమర్నాథ్ మాటల్ని పక్కదోవ పట్టిస్తారా ?

వైయ‌స్ఆర్‌సీపీ నేత గుడివాడ అమర్నాథ్... హోంమంత్రి అనితను కించపరిచారని, ఆమె మేకప్ గురించి మాట్లాడారని, తద్వారా రాష్ట్రంలో మొత్తం స్త్రీ సమాజాన్ని కించపరిచారంటూ కూటమి పార్టీలు నానా హంగామా చేస్తున్నాయి. నారా లోకేష్ ఆదేశాలతో టీడీపీ నాయకులు అతిగా స్పందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా మహిళల కట్టూబొట్టూ గురించి మాట్లారంటూ ట్వీట్లు కూడా పెడుతున్నారు. అసలు అమర్నాథ్ మాట్లాడింది మేకప్ గురించి మాత్రమే. కట్టూ బొట్టూ గురించి ఎక్కడా మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ చెప్పినట్లు హోంమంత్రి కూడా సంప్రదాయబద్దంగా ఉండాలి కదా. రాజకీయాల్లో కొందరికి బలహీనతలు, దీర్ఘకాలిక రుగ్మతలు ఉంటాయి. ఇందులో ఓరల్ డయేరియా ఒకటి. హోంమంత్రి నోటి నుంచి మాటలు ఇలాగే ప్రవాహంలా వస్తుంటాయి.  సభ్యతా, సంస్కారం లేకుండా అందరినీ విచ్చలవిడిగా తిట్టేస్తుంటారు. కానీ సమాజం నుంచి మాత్రం మన్నన, గౌరవం కోరుకుంటారు. ఇది ఎంతవరకూ ధర్మం ? అద్దాల మేడలో కూర్చుని సమాజం మీద రాళ్లు వేస్తే తిరిగి రాళ్లే వస్తాయన్న విషయం లోకేష్, పవన్ కు తెలియదా ? లోకేష్, చంద్రబాబు చుట్టూ చండాలపు, దిగజారిన మనుషులు ఉన్నారన్న విషయం గుర్తుంచుకోవాలి. 

హోంమంత్రి వ్యాఖ్యలు మర్చిపోయారా ?

ఒక్క రోజైనా హోంమంత్రి బాధ్యతగా వ్యవహరించారా? సంస్కారవంతంగా మాట్లాడారా ? ఓ మాజీ మంత్రిని పట్టుకుని ఎవడో మాట్లాడుతున్నాడని హోంమంత్రి చెప్పలేదా ?,  మీ ఇష్టం గుడ్లు కావాలంటే పగలగొట్టుకుని ఫ్రైడ్ రైస్ లు వండుకోండి. కానీ హోంమంత్రి గారి నోటికి హద్దు ఉండాలి కదా. ముందు మీరు సభ్యతగా విమర్శలు చేయండి. చంద్రబాబు, లోకేష్ మీకు హోంమంత్రి కుర్చీ ఇచ్చి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల్ని కించపర్చడానికి పనిముట్టుగా వాడుకుంటున్నారు. వాయనం ఇస్తే తిరిగి వాయనం ఇస్తారన్న విషయం టీడీపీ నేతలు గుర్తుంచుకోవాలి. వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతమ్మపై అనిత చేసిన వ్యాఖ్యలు పవన్, లోకేష్ కు గుర్తులేవా ? అనిత మాటల్ని ఏరోజూ తప్పని, మాట్లాడొద్దని ఏ రోజైనా చంద్రబాబు, లోకేష్ చెప్పారా ? మీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మాజీ మంత్రి రోజాపై చేసిన జుగుప్సాకర వ్యాఖ్యలు ఇంకా జనం మర్చిపోలేదు. రోజాను నీచంగా తిట్టిన ఈ వ్యక్తిని పవన్ కళ్యాణ్ మెచ్చుకుని, అభినందించారని ఆయనే సిగ్గులేకుండా చెప్పుకుంటున్నాడు. ఇదేనా నీతులు మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ సంస్కారం ? మంత్రిగా ఉన్న రోజాను డైమండ్ అని సంభోదిస్తూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేయలేదా ? అంటే పవన్ కళ్యాణ్ కు మంత్రి పదవితో పాటు సంస్కారం కూడా కొత్తగా వచ్చిందన్నమాట. సుగాలి ప్రీతి కోసమే పార్టీ పెట్టానని పవన్ కళ్యాణ్ గతంలో చెప్పుకున్నారు. ఇప్పుడు హోంమంత్రి అనితను కూడా అమాయకురాలిని చేసి లోకేష్, పవన్ రాజకీయానికి వాడేసుకుంటున్నారు. అసలు అనిత కట్టుబొట్టు గురించి ఎవరు మాట్లాడారో పవన్ కళ్యాణ్ చెప్పాలి. 

అమర్నాథ్ కేసులకు భయపడే వ్యక్తి కాదు

లోకేష్ గతంలో వైఎస్ భారతమ్మ గారి గురించి, ఆమె కుమార్తెల గురించి ఇష్టారాజ్యంగా మాట్లాడారు. కానీ ఇప్పుడు సంస్కారం గురించి, అమర్నాథ్ గురించి మాట్లాడుతున్నారు. మీ ఇంట్లో వాళ్లు తప్ప మిగతా వాళ్లు ఆడవాళ్లు కాదా ? లోకేష్ అధికార మదంతో జగన్మోహన్ రెడ్డి గారి గురించి, వారి ఇంట్లో మహిళల గురించి మాట్లాడొచ్చు. ఇతరులు మాట్లాడితే మాత్రం సహించలేరు. మీ చేతిలో ఎల్లో మీడియా ఉంది కాబట్టి ఇష్టారాజ్యంగా ఇతరులపై రాతలు రాయిస్తారు. ఓ మాజీ ముఖ్యమంత్రి శ్రీమతి గారి గురించి, కుమార్తెల గురించి మీరు ఇలా మాట్లాడొచ్చా ? మీరు ఇలా రెచ్చగొడితే మీ ఇంట్లో ఆడవాళ్ల గురించి కూడా ఇతరులు మాట్లాడకుండా ఉంటారా ? రెడ్ బుక్ పేరుతో లోకేష్ ఈ రాష్ట్రాన్ని పూర్తిగా దిగజార్చారు. అమర్నాథ్ ఏ మహిళ గురించి ఏం మాట్లాడారు ? అమర్నాథ్ కు లోకం తెలియకముందే తండ్రి చనిపోతే అక్క సంరక్షణలో పెరిగినవాడు. తండ్రి లేకుండా పెరిగిన వాడు, తల్లి తాటున అక్క సంరక్షణలో పెరిగిన వ్యక్తి. అతను స్త్రీ సమాజం గురించి ఎలా మాట్లాడతారు ? మీరు కావాలనే నీచంగా దిగజారి మాట్లాడుతున్నారు. అమర్ పై రాష్ట్రంలో ఓ పది ప్రాంతాల్లో కేసులు పెట్టి తిప్పాలని పోలీసుల నుంచి ఇప్పటికే మాకు సమాచారం ఉంది. పది కాకపోతే 15 కేసులు పెట్టుకోండి, పోలీసు స్టేషన్లు తిప్పండి, ఇవన్నీ చేసి అమర్నాథ్ ను వైయ‌స్ఆర్‌సీపీలో పెద్ద నాయకుడిని మాత్రమే చేయగలరు. గుర్తుపెట్టుకోండి. అమర్నాథ్ ను మీ తప్పుడు కేసులు, అరెస్టులు ఏమీ అతని రోమం కూడా కదల్చలేరు. అతను రాజకీయంగా పెద్ద నాయకుడు అవుతారు అంతే. అంబటి రాంబాబు ఇంటి మీదకు ఇలాగే వెళ్లి ధ్వంసం చేసి ఎదురు కేసులు పెట్టి అరెస్టు చేస్తే మా కులానికి టైగర్ అయ్యాడు. మీ చర్యలతో అంబటి రాంబాబును ఈ రాష్ట్రానికి ఓ పెద్ద నాయకుడిని చేశారు. ఇప్పుడు అమర్నాథ్ నూ కేసులతో వేధించాలని చూస్తే అతను భయపడతాడా ? అతను గుడివాడ గుర్నాథరావు కొడుకు. ఎవరికీ  భయపడడు.కుసంస్కారంతో రాజకీయాలు నడుపుతున్న మీరు. ఇప్పుడు అందరికీ సంస్కారం నేర్పుతానంటే ఈ సమాజం హర్షించదు. 

సాయికృష్ణను అన్యాయంగా చంపేశారు

మే 9న గాదె విజయలక్ష్మి అనే మహిళ ఇంటికి విజయవాడ కృష్ణలంక పోలీసులు వెళ్లి దౌర్జన్యంగా ఫోన్ లాక్కున్నారు. ఫోన్ ఆధారంగా ఆమె కుమారుడు సాయికృష్ణను ప్రకాశం జిల్లా నుంచి ఎత్తుకొచ్చారు. రాత్రి అనుమానం వచ్చి కుమారుడికి ఫోన్ చేస్తే కలవలేదు.ఆమె మార్కాపురం వెళ్లి కొడుకు గురించి ఆరా తీస్తే సీసీ ఫుటేజ్ దొరికింది. 6 రోజుల పాటు స్టేషన్లకు తిరిగినా, పోలీసుల కాళ్లు పట్టుకుని ఏడ్చినా సమాచారం ఇవ్వలేదు. అరెస్టు చూపించకుండా, కోర్టులో ప్రవేశపెట్టకుండా ప్రతీరోజూ రేపు వస్తాడని చెప్పారు. సీఐ ఎవరితోనూ మాట్లాడుకుని, బలవంతంగా ఎత్తుకొచ్చి స్టేషన్లో గోళ్లు తీయించి వేధించారని అక్కడి కానిస్టేబుళ్లు చెప్పారు. సీఐ నాగరాజు బరితెగింపుకు కారణం విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు కాదా ? విజయవాడ సిటీ పరిధిలో పోలీసులు చట్టం, న్యాయం, కోర్టులంటే లెక్కలేకుండా ప్రవర్తిస్తున్నారంటే, నియంత పాలన సాగిస్తున్నారంటే రాజశేఖర్ బాబుకు బాధ్యత లేదా ? మిమ్మల్ని కలవడానికి వెళ్తే ఆ తల్లిని కలిసేందుకు కూడా మీరు ఇష్టపడలేదు. మీ పోలీసులు నా కొడుకుని చంపేస్తున్నాడని తల్లి ఫిర్యాదు చేసినా మీరు ఎందుకు అడ్డుకోలేకపోయారు ? విజయవాడ శాంతిభద్రతల్ని గాలికొదిలేసి, సిట్ ఛీఫ్ గా వైయ‌స్ఆర్‌సీపీ నేతలపై వేధింపుల్లో బిజీగా ఉన్నారా ? ఎవరి కళ్లలో ఆనందం కోసం మీరు ఇదంతా చేస్తున్నారు ? 35 రోజులుగా తన కొడుకు కోసం ఆ తల్లి మీ పోలీసు స్టేషన్ల చుట్టూ తిరిగినా, కన్నీరు మున్నీరుగా ఏడ్చినా ఎందుకు స్పందించలేదు? సీఐ నాగరాజు మనసు కరగకపోయినా, సీపీ రాజశేఖర్ బాబు మనసైనా కరగాలి కదా. దీనిపై మీరు మాట్లాడరు, హోంమంత్రి, డీజీపీలు కూడా మాట్లాడరు. ఆ తల్లి ఇప్పటికీ తన కొడుకు బతికున్నాడా అని అడుగుతోంది. బతికుంటే చాలు ఎలాగోలా చూసుకుంటాం అని అడుగుతోంది. చనిపోతే శవం అయినా ఇమ్మంటే కూడా మీ మనసు కరగడం లేదు. నా కొడుకుని కాల్చేస్తే అస్తికలు అయినా ఇవ్వండి, బూడిద అయినా ఇవ్వండని అడుగుతున్నా మీరు స్పందించడం లేదు. 15వ తేదీన కోర్టులు తెరుస్తున్నారని తెలిసి సీఐ నాగరాజును బదిలీ చేసి మురళీకృష్ణకు బాధ్యతలు ఇచ్చారు. అయినా హైకోర్టు, ఆ కుటుంబం, ఈ సమాజం ఊరుకుంటాయా ? విజయవాడ శాంతిభద్రతల్ని సీపీ రాజశేఖర్ బాబు వదిలేయడమే జరుగుతున్న అనర్థాలకు కారణం. రాజశేఖర్ బాబు సిట్ తప్ప శాంతి భద్రతలు కాపాడే బాధ్యతలు పట్టించుకోరా ? ఇప్పటికైనా సాయికృష్ణ కేసులో ఏడుగురిని సస్పెండ్ చేసి, ఐపీఎస్ తో విచారణ ఎందుకు చేయించట్లేదు ? 29వ తేదీన హెబియస్ కార్పస్ పిటిషన్ పై హైకోర్టుకు సమాధానం చెప్పాలన్న విషయం కూడా మీకు గుర్తులేదా ? 

సాయికృష్ణ కేసుపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్డి విచారణ

సాయికృష్ణ తరహాలో పోలీసులు ఎత్తుకొచ్చి చంపేసేలా ఉంటే ఇక కోర్టులెందుకు ? విజయవాడలో సాయికృష్ణ ఒక్కడే రౌడీ షీటరా ? ఒక్క వెస్ట్ జోన్ లోనే ఎంతో మంది రౌడీ షీటర్లు ఉన్నారు. గతంలో బుడ్డా శంతన్ అనే రౌడీ షీటర్ ను ఇలాగే తీసుకొచ్చి కాల్చేశారు. అలా చేసినా అప్పట్లో ఎఫ్ఐఆర్ ఉండేది, శవ పంచనామా ఉండేది. వాళ్లేదో న్యాయపోరాటం చేసుకునే వారు. కానీ ఇప్పుడు బూడిద కూడా లేకుండా చేసి విజయవాడ పోలీసులు కొత్త సంప్రదాయం తెచ్చారు. అంటే అప్ గ్రడేషన్ అన్నమాట. ఇది ఆటవిక, పాశవిక చర్య కాదా సీపీ రాజశేఖర్ బాబు చెప్పాలి. ఇలాంటి ఘటనపై మీరు నోరు విప్పకపోవడం ఏంటి ? అంబటి రాంబాబు దీనిపై ప్రశ్నించగానే వెంటనే ట్విట్టర్ హ్యాండిల్స్ లో ఆయనపై ఎదురుదాడి మొదలుపెట్టేశారు. చనిపోయిన సాయికృష్ణ రౌడీ షీటర్, అతనిపై 22 కేసులు ఉన్నాయని ప్రచారాలు చేస్తున్నారు. ఈ రెండేళ్లలో సాయికృష్ణ జనసేన జెండా మోసినప్పుడు, ఎన్నికల్లో మీ గెలుపు కోసం పనిచేసినప్పుడు మీకు బాగుంది, కానీ చనిపోయాక రౌడీ అని గుర్తుకొచ్చిందా ? అతను రౌడీ అయితే అతనితో ఎందుకు పనిచేయించుకున్నారు ? ముంబై దాడుల్లో నిజాయితీగల పోలీసు అధికారుల్ని కాల్చేసిన కసబ్ ను కూడా చట్టప్రకారమే విచారణ ఉరితీశారు. కానీ కేసులున్న సాయికృష్ణను చంపేయడానికి సీఐ నాగరాజు ఎవరు, ఈ బెజవాడ పోలీసులెవరని అడుగుతున్నాను. మీ ఎమ్మెల్యే ఒకరిపై 95 కేసులున్నాయి, మరి సెల్యూట్ లు ఎందుకు కొడుతున్నారు. ఇదే సీఐ నాగరాజును అక్కడ డ్యూటీ చేసి చంపేయమని చెప్పండి. రౌడీ షీటర్లలో కేసులు ఉన్న వాళ్లు లేరా ? సాయికృష్ణ నేరం చేస్తే చట్టప్రకారం శిక్షించాలి. ఇప్పటికైనా పోలీసులు చట్టప్రకారం బాధ్యతలు నిర్వర్తించాలి. సాయికృష్ణ కేసులో సీబీఐ లేదా సిట్టింగ్ జడ్డితో విచారణ జరిపించాలని పేర్ని నాని డిమాండ్ చేశారు.

Back to Top