ఫిబ్రవరిలో ఖమ్మం జిల్లాకు షర్మిల

తల్లాడ:

రాష్ర్టంలో రానున్నది రాజన్న రాజ్యమేనని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా జిల్లాలో అన్ని స్థానాలూ వైయస్ఆర్ కాంగ్రెసే గెలుచుకుంటుందని పార్టీ జిల్లా కన్వీనర్ పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. మండలంలోని కుర్నవల్లిలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.  దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రస్తుత ప్రభుత్వం నీరుగార్చిందని విమర్శించారు. శ్రీమతి వైయస్ షర్మిల పాదయాత్ర ఫిబ్రవరిలో జిల్లాకు చేరుకుంటుందని చెప్పారు.

Back to Top