మద్యం సిండికేట్లకు కిరణ్ అండ: భూమన

తిరుపతి 29 జూన్ 2013:

పుణ్యక్షేత్రమైన తిరుపతిని మద్యపాన రహిత ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శనివారం నిరవధిక దీక్షకు పూనుకుందిది. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు శనివారం ఉదయం తిరుపతి ఆర్టీసి బస్టాండ్ సమీపంలోని గాంధీ విగ్రహం వద్ద దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ మద్యం సిండికేట్లు బరితెగించి వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అండతో సిండికేట్ల ఇష్టారాజ్యమైందని విమర్శించారు. దీక్షలో మహిళలు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Back to Top