బీసీలంటే ఎందుకంత అక్కసు

విశాఖ: బీసీలంటే టీడీపీ నేతలకు ఎందుకంత అక్కసుఅని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ప్రశ్నించారు. బీసీలంటే చంద్రబాబు, లోకేష్‌కు అంత చులకనా అని మండిపడ్డారు. స్పీకర్‌ వ్యవస్థను టీడీపీ నేతలు కించపరుస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు, లోకేష్‌, కూనపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. స్పీకర్‌పై టీడీపీ నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలను ధర్మశ్రీ తీవ్రంగా ఖండించారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..బీసీలపై ఇష్టారాజ్యంగా టీడీపీ నేతలు మాట్లాడితే..భవిష్యత్‌లో ఇప్పుడు వచ్చిన 23 ఎమ్మెల్యే స్థానాల్లో 2, 3 సీట్లే వస్తాయని  హెచ్చరించారు. బీసీలంతా ఏకమై టీడీపీకి రాజకీయ సమాది కడతారని పేర్కొన్నారు. స్పీకర్‌ వ్యవస్థను కించపరిచేలా మాట్లాడటం దుర్మార్గమన్నారు. స్పీకర్‌ తమ్మినేని సీతారాం నిజాయితీ, నిబద్ధత కలిగిన వ్యక్తి అన్నారు. బీసీ వ్యక్తి స్పీకర్‌గా ఉండటం చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్‌ను ఏకవచనంతో సంభోదిస్తారా అని ప్రశ్నించారు. తక్షణమే టీడీపీ నేతలు స్పీకర్‌ కాళ్లు పట్టుకొని క్షమాపణ చెప్పాలని డిమాండు చేశారు.
 

Read Also: ఎన్నికల మేనిఫెస్టోనే ప్రభుత్వ ఎజెండా

తాజా ఫోటోలు

Back to Top