స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలి

ఎంపీ మిథున్‌రెడ్డి పిలుపు

శ్రీ సత్యసాయి జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ విస్తృత స్థాయి స‌మావేశం

పెనుకొండ:  స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని వైయ‌స్ఆర్‌సీపీ రీజినల్‌ కో-ఆర్డినేటర్‌, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి పిలుపునిచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని ఎన్‌ కన్వెన్షన్‌ హాలులో నిర్వహించిన వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ బలోపేతంపై విస్తృతంగా చర్చించారు.

ఈ సమావేశంలో మిథున్‌రెడ్డి మాట్లాడుతూ.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లాలో వైయ‌స్ఆర్‌సీపీ సత్తా చాటేలా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. జిల్లాలోని ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో వైయ‌స్ఆర్‌సీపీ జెండా రెపరెపలాడేలా కష్టపడి పనిచేయాలని, పార్టీ శ్రేణులంతా ఐక్యంగా ఎన్నికల కార్యాచరణను ముందుకు తీసుకెళ్లాలని  కోరారు. ఈ కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్య‌క్షురాలు ఉషాశ్రీ‌చ‌ర‌ణ్‌, మాజీ ఎమ్మెల్యేలు కేతిరెడ్డి వెంక‌ట్రామిరెడ్డి, తోపుదుర్తి ప్ర‌కాశ్‌రెడ్డి, దుద్దుకుంట, దీపిక‌, వీర‌న్న‌, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
 

Back to Top