త‌ప్పు చేశారు కాబ‌ట్టే సీబీఐ విచార‌ణకు భ‌య‌ప‌డుతున్నారు 

డీఎస్సీ అక్ర‌మాల సూత్ర‌ధారి నారా లోకేష్ రాజీనామా చేయాలి

ప్ర‌భుత్వానికి వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుల డిమాండ్ 

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో వేర్వేరుగా నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో మాట్లాడిన మాజీ ఎంపీ మార్గాని భ‌ర‌త్‌, పార్టీ అధికార ప్ర‌తినిధులు ఆరె శ్యామ‌ల‌, కొండా రాజీవ్ గాంధీ.
  
స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల వివ‌రాల‌ను ప‌బ్లిక్ డొమైన్‌లో పెట్టాలి

మార్గాని భరత్, మాజీ ఎంపీ 

తాడేప‌ల్లి: రాష్ట్రంలో జరుగుతున్న ఉద్యోగాల కుంభకోణంపై విజిలెన్స్ ఎంక్వయిరీ కాదు, వెంటనే సీబీఐ ఎంక్వయిరీ జరగాలన్నదే వైయ‌స్ఆర్‌సీపీ ప్రధాన డిమాండ్. పేపర్ లీక్ చేసిన నవీన్ అనే వ్యక్తికి ఫస్ట్ ర్యాంక్ వచ్చినా ఉద్యోగం ఇవ్వకుండా దాచిపెట్టడం వెనుక పెద్ద కుట్ర ఉంది. అసెంబ్లీలో సాక్షిగా ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ క్లీన్ చిట్ ఇచ్చుకోవడం సిగ్గుచేటు. నారా లోకేష్ విసిరి పారిపోవ‌డం కాదు.. ద‌మ్ముంటే మాతో బ‌హిరంగ చ‌ర్చ‌కు సిద్ధ‌మా?  పేప‌ర్ లీక్ గురించి ముందే తెలుసునని రుజువవుతోంది. జూడోలో ఫేక్ సర్టిఫికెట్లు సృష్టించి ఉద్యోగాలు పొందారని ఆధారాలతో సహా నిరూపించినా ఏడాదిగా ప్రభుత్వం ఏం చేస్తోంది? నకిలీ సర్టిఫికెట్లతో అక్రమంగా ఉద్యోగాలు పొందిన వారిని తొలగించడానికి ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది? ప్రభుత్వం ఇచ్చిన స్పోర్ట్స్ ఉద్యోగాల పూర్తి వివరాలను, సర్టిఫికెట్లను పబ్లిక్ డొమైన్‌లో పెట్టాలి. నీట్ పేప‌ర్ లీకేజీకి బాధ్య‌త వ‌హిస్తూ కేంద్ర మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ తన పదవికి రాజీనామా చేశారు. అదేవిధంగా డీఎస్సీ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ నారా లోకేష్ కూడా వెంటనే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలి. విజిలెన్స్ విచారణ పేరుతో కాలయాపన చేసే కుట్ర త‌ప్ప ఇంకేమీ లేదు. అసలు నిజాలు బయటకు రావాలంటే సీబీఐ విచారణ జ‌ర‌గాలి. 

 పార‌ద‌ర్శ‌కంగా నిర్వ‌హిస్తే సీబీఐ విచార‌ణకు ఆదేశించొచ్చు క‌దా:   ఆరె శ్యామల, వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి

నారా చంద్రబాబు స్కిల్ స్కామ్ కి మించి వారి తనయుడు నారా లోకేష్ మెగా డీఎస్సీ స్కామ్ చేస్తూ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. విద్యా వ్యవస్థ కంటూ ఎప్పుడూ కూడా చంద్రబాబు అతి తక్కువ విలువ ఇచ్చారు అనడానికి వారి హయాంలో లీకైన 1995 టెన్త్ పేపర్, 1996 ఎంసెట్, 1997 ఇంటర్, 2025 బిఈడి, మొన్నటి డీఎస్సీ లీకేజీలే సాక్ష్యం. డీఎస్సీ గురించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళ అకౌంట్లు బ్లాక్ చేస్తూ, అన్యాయాలపై మాట్లాడుతున్న వారి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. మీరు చేసిన తప్పుని ఒప్పుకొని ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ ఇమ్మిడియట్ గా రిజైన్ చేయాలని డిమాండ్ చేస్తున్నాము. అలాగే చంద్రబాబు ఈ డీఎస్సీ కుంభకోణం పై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతున్నాము. పారదర్శకంగా నిర్వహిస్తే డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించకూడదు? డీఎస్సీ కుంభకోణంపై సీబీఐ ని ఆదేశించి వాస్తవాలు ఏంటో నిగ్గు తేల్చాలని డిమాండ్ చేస్తున్నాము. సరస్వతి పుత్రులకు అన్యాయం చేసి డిఎస్సి ద్వారా వెన్నుపోటు పార్టీ మూటకట్టుకున్న పాప చరిత్ర రాష్ట్ర ప్రజలందరి ముందుకు రావాలంటే సీబీఐ ఎంక్వైరీ వేయాల్సిందే. అప్పటివరకు నారా లోకేష్ ఈ స్కామ్ కి బాధ్యత వహిస్తూ తన పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నాం
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నిజాలను వెలుగులోకి తీసుకురావాలని కోరుతున్నాము. 

 వైయ‌స్ఆర్ మాదిరిగా చంద్ర‌బాబుకి సీబీఐ విచార‌ణ కోరే ద‌మ్ముందా?
- కొండా రాజీవ్ గాంధీ, వైయ‌స్ఆర్  కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి

తాడేపల్లి: రాష్ట్రంలో డీఎస్సీ కుంభకోణం ద్వారా ఉద్యోగాల జాతర కాస్తా కుంభకోణాల జాతరగా మారిపోయింది. స్పోర్ట్స్, పీహెచ్‌సీ కోటాలతో పాటు రిజర్వేషన్లలోనూ నకిలీ సర్టిఫికెట్లతో అక్రమ నియామకాలు జరిగాయి. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్షాలు కొడుకు వైఎస్ జ‌గ‌న్ గారిపై ఆరోపణలు చేస్తే స్వయంగా ఆయనే నిండు అసెంబ్లీలో సీబీఐ దర్యాప్తునకు ఆదేశించి నిజాయితీని నిరూపించుకున్న గొప్ప చరిత్ర వైఎస్ కుటుంబానిది. కానీ నేడు డీఎస్సీ అక్రమాల ఆరోపణలు ఎదుర్కొంటున్న తన కొడుకు నారా లోకేష్‌ను కాపాడుకునేందుకు సీఎం చంద్రబాబు నాయుడు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడానికి ఎందుకు భయపడుతున్నారు? కేవలం లోకేష్ భవిష్యత్తు కోసం రాష్ట్రంలోని రోడ్డున పడిన నిరుద్యోగ యువత జీవితాలను నాశనం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వెలుగులోకి వస్తున్న డీఎస్సీ అక్రమాలు, నకిలీ సర్టిఫికెట్ల డాటాలు అడ్డంగా దొరికిపోయినా ప్రభుత్వం సింపతీ డైలాగులతో తప్పించుకోవాలని చూస్తోంది
లోకేష్ కారణంగా నష్టపోయిన మూడున్నర లక్షల మంది డీఎస్సీ రాసిన అభ్యర్థులకు తక్షణమే న్యాయం జరగాలి. బాధ్యత గల ముఖ్యమంత్రిగా చంద్రబాబు వెంటనే తన కొడుకు చేత రాజీనామా చేయించి సీబీఐ ఎంక్వైరీకి పంపాలి. అక్రమాలు బయటపడతాయనే భయంతోనే ప్రభుత్వం ప్రశ్నించే జర్నలిస్టులు, మీడియాపై కేసులు పెడుతూ అప్రకటిత ఎమర్జెన్సీని నడుపుతోంది. దమ్ముంటే డీఎస్సీ అభ్యర్థులు లేవనెత్తుతున్న ఆధారాలు, ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. లోకేష్ చేసే అర్థం లేని రాజకీయ సవాళ్లను ఖండిస్తున్నాం, దమ్ముంటే రాజీనామా చేసి నిరుద్యోగుల ముందు చర్చకు రావాలి. భవిష్యత్తులో వైఎస్ జగన్ గారి నాయత్వంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ డీఎస్సీ కుంభకోణంపై సమగ్రంగా సీబీఐ విచారణ జరిపించి కారకులైన ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు.

Back to Top