కుప్పంలో టీడీపీ గుండాగిరి

 వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలే లక్ష్యంగా భౌతిక దాడులు.. వాహనాల ధ్వంసం

చిత్తూరు జిల్లా : కుప్పం నియోజకవర్గంలో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై టీడీపీ నాయకుల దాడులు కొనసాగుతున్నాయి. వైయ‌స్ఆర్‌సీపీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని తిరిగి వెళ్తున్న పార్టీ నాయకులను లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడ్డారు. రామకుప్పం మండలం 64 పెద్దూరు ఎంపీటీసీ వెంకటరెడ్డిపై దాడి చేసి, ఆయన కారును ధ్వంసం చేశారు.

Image

ఆంధ్రా–కర్ణాటక సరిహద్దులోని రాజుపేట వద్ద కూడా టీడీపీ శ్రేణులు వాహనాన్ని ధ్వంసం చేసిన ఘటన చోటుచేసుకుంది. సమావేశానికి హాజరై తిరిగి వెళ్తున్న వైయ‌స్ఆర్‌సీపీ నాయకులను అడ్డుకుని దాడులకు పాల్పడటం కుప్పంలో నెలకొన్న పరిస్థితులకు అద్దం పడుతోంది. ప్రజాస్వామ్య పద్ధతిలో రాజకీయ కార్యకలాపాలు నిర్వహిస్తున్న వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని భౌతిక దాడులకు పాల్పడటంపై పార్టీ శ్రేణుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.

Image

Back to Top