స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి

 కర్నూలులో జిల్లా స్థాయి విస్తృత సమావేశంలో వైయ‌స్ఆర్‌సీపీ నేత‌ల దిశానిర్దేశం 

కర్నూలు: కర్నూలు ఎస్వీ కాంప్లెక్స్‌లో వైయ‌స్ఆర్‌సీపీ కర్నూలు జిల్లా స్థాయి విస్తృత సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ శ్రేణులకు నేతలు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, పార్టీ బలోపేతం, క్షేత్రస్థాయిలో కార్యకర్తల సమన్వయంపై చర్చించారు.

ఈ సమావేశానికి వైయ‌స్ఆర్‌సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి, వైయ‌స్ఆర్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సాయిప్ర‌సాద్‌రెడ్డి, కంగాటి శ్రీదేవి, నియోజకవర్గ సమన్వయకర్తలు డాక్ట‌ర్ ఆదిమూల‌పు స‌తీష్‌, ఇన్‌చార్జ్‌లు కోట్ల హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌రెడ్డి, ప్ర‌దీప్‌రెడ్డి, రాజీవ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ శ్రేణులంతా సమన్వయంతో పనిచేస్తూ వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని నేతలు సూచించారు. గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేసి ఎన్నికలను సమర్థంగా ఎదుర్కొనేలా కార్యాచరణ రూపొందించారు.
 

Back to Top