వైయ‌స్ఆర్‌సీపీ ప్రాంతీయ సమన్వయకర్తలుగా వై.వి. సుబ్బారెడ్డి, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి

తాడేపల్లి: వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలను నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. పార్టీ బలోపేతం, సమన్వయం, కార్యకర్తలకు అందుబాటులో ఉండేలా ప్రాంతాల వారీగా బాధ్యతలను అప్పగించింది.

మాజీ ఎంపీ డాక్టర్ వై.వి. సుబ్బారెడ్డిని ఉమ్మడి గుంటూరు జిల్లాకు ప్రాంతీయ సమన్వయకర్తగా నియమించింది. అలాగే ఆళ్ల అయోధ్య రామిరెడ్డికి ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి ప్రకాశం జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్తగా బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.
 

Back to Top