తాడేపల్లి: రాష్ట్రంలో డీఎస్సీ అక్రమాల అంశానికి సంబంధించి చంద్రబాబుపై వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్‌మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు. చంద్రబాబూ.. డీఎస్సీ నియామకాలను నిజంగా నిష్పక్షపాతంగా..పారదర్శకంగా నిర్వహించాలన్నదే మీ ఉద్దేశమైతే అర్హత పరీక్ష అవసరం లేకుండా జీవోలు ఎందుకు జారీ చేశారు?. క్వాలిఫైయింగ్ పరీక్ష నిబంధనను పక్కనపెట్టి నియామకాలను ఎందుకు చేపట్టారు?.డీఎస్సీ నియామక ప్రక్రియ పూర్తయిన తర్వాత మళ్లీ పాత విధానాన్ని ఎందుకు అమలు చేశారు?. డీఎస్సీ సమయంలో ఒక విధానం.. నియామకాలు పూర్తయ్యాక మరో విధానం.. దీన్ని నిష్పక్షపాత, పారదర్శక నియామక ప్రక్రియ అని ఎలా అంటారు? అర్హత పరీక్ష నిబంధనను తొలగించడం ద్వారా డీఎస్సీ అక్రమాలకు ద్వారాలు తెరవలేదా?.నిబంధనలను మార్చి అక్రమాలకు అవకాశం కల్పించిన దానిపై చంద్రబాబు సమాధానం చెప్పాలి. డీఎస్సీలో జరిగిన అక్రమాలకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నైతిక బాధ్యత వహించరా?’అంటూ ధ్వజమెత్తారు. https://x.com/ysjagan/status/2098425817592467825/video/1