హిందూపురం: హిందూపురం పట్టణ పరిధిలోని ఆర్‌కే ఫంక్షన్ హాలులో వైయస్ఆర్‌సీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నియోజకవర్గ ఇన్‌చార్జ్ టి.ఎన్. దీపికా వేణు రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు. అన్ని గ్రామాలు, అన్ని వార్డుల్లో వైయస్ఆర్‌సీపీ జెండా ఎగురవేసేలా నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని, కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించి ఎన్నికల్లో వైయస్ఆర్‌సీపీ విజయడంకా మోగించాలని సూచించారు. సమావేశం అనంతరం నూతన కమిటీలలో నియమితులైన పార్టీ నాయకులు, కార్యకర్తలకు టి.ఎన్. దీపికా వేణు రెడ్డి పార్టీ గుర్తింపు కార్డులను అందజేశారు. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేస్తూ స్థానిక ఎన్నికలకు సమాయత్తం కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హిందూపురం పార్లమెంట్ పరిశీలకుడు రమేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘని, వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.