పీలేరు: రాజంపేట పార్లమెంట్ సభ్యుడు, వైయస్ఆర్‌సీపీ రీజినల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదినం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వైయస్ఆర్‌సీపీ శ్రేణులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. వివిధ నియోజకవర్గాల్లో అన్నదాన కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలతో పాటు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. పీలేరు నియోజకవర్గంలో నిర్వహించిన రక్తదాన, అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి హాజరై కార్యక్రమాలను ప్రారంభించారు. ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాల ద్వారా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలను నిర్వహించడం విశేషంగా నిలిచింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, వైయస్ఆర్‌సీపీ ప్రచార విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ పి. హరిప్రసాద్ రెడ్డి, వైయస్ఆర్‌సీపీ యువజన విభాగం రీజినల్ కోఆర్డినేటర్ హేమంత్ కుమార్ రెడ్డి, వైయస్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి చక్రధర్ యాదవ్ తదితర వైయస్ఆర్‌సీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎంపీ మిథున్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.