స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ విజయమే లక్ష్యం

ప్రతి గడపకూ వెళ్లి కూటమి పాలన వైఫల్యాలను ప్రజలకు వివరించాలి

ఎన్టీఆర్ జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు దేవినేని అవినాష్

విజయవాడ : రానున్న కార్పొరేషన్, స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ విజయమే లక్ష్యంగా ప్రతి నాయకుడు, కార్యకర్త సమష్టిగా పనిచేయాలని ఎన్‌టీఆర్ జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జ్ దేవినేని అవినాష్ పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వారి పక్షాన నిలబడాలని సూచించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాల్లో భాగంగా ఎన్‌టీఆర్ జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా “వెన్నుపోటు పార్టీ – వెన్నుపోటు పాలన” పోస్టర్‌ను దేవినేని అవినాష్, రాష్ట్ర సీనియర్ నాయకుడు కడియాల బుచ్చిబాబుతో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో మాజీ ఫ్లోర్ లీడర్, మాజీ డిప్యూటీ మేయర్, ఫ్లోర్ పార్లమెంట్ కార్యదర్శులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సెప్టెంబర్ 22 నుంచి ఇంటింటికీ వెళ్లాలి

“వెన్నుపోటు పాలన”పై సెప్టెంబర్ 22 నుంచి ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలకు వివరించే బాధ్యత మనపై ఉంది. చంద్రబాబు రాజకీయ చరిత్రలో వెన్నుపోటు రాజకీయాలకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రజలకు వాస్తవాలను వివరించి వైయ‌స్ఆర్‌సీపీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలి. రానున్న కార్పొరేషన్, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయమే ప్రధాన లక్ష్యంగా అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగాలి. 2024 ఎన్నికల్లో అన్ని పార్టీలు ఏకమై వైయ‌స్ఆర్‌సీపీని ఎదుర్కొన్నా పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు వైయ‌స్ఆర్‌సీపీ అండగా ఉంటుంది.

 కార్యకర్తలపై కేసులు, వేధింపులు ఆపాలి

కూటమి ప్రభుత్వం పోలీసు వ్యవస్థను ఉపయోగించుకుని వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలపై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. కేసులు నమోదు చేసి కార్యకర్తలను వేధించే విధానాన్ని ప్రభుత్వం విడనాడాలి. పార్టీ కార్యకర్తలకు వైయ‌స్ఆర్‌సీపీ ఎప్పటికీ అండగా ఉంటుంది. కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ అప్పటి ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ పేదలకు అండగా నిలిచారు. జగన్ ప్రభుత్వ హయాంలో పేదలకు అందిన సంక్షేమాన్ని ప్రతి గడపకూ వెళ్లి వివరించాలి.

 స్థానిక సమస్యలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి

రేషన్ వ్యవహారాలు, నిర్మాణ అనుమతులు తదితర అంశాల్లో స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌పై వస్తున్న ఆరోపణలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. ప్రజలకు సంబంధించిన అంశాల్లో పారదర్శకత ఉండేలా చర్యలు తీసుకోవాలి. కూటమి నాయకులు చేపడుతున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. జగన్ హయాంలో రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు కల్పించే చర్యలు చేపట్టగా, వాటిని చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేసింది. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాజకీయంగా విమర్శలు చేసుకోవచ్చు. అయితే రాజకీయ విమర్శల హద్దులు దాటి కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు. రాజకీయాల్లో హుందాతనం, సంయమనం పాటించాలి.

 ప్రజల పక్షాన నిలబడటమే లక్ష్యం

ప్రజా సమస్యలను నిరంతరం తెలుసుకుని, ప్రజల పక్షాన నిలబడి, వైయ‌స్ఆర్‌సీపీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయడమే ప్రతి నాయకుడు, కార్యకర్త ప్రధాన లక్ష్యంగా పెట్టుకోవాలని దేవినేని అవినాష్ పిలుపునిచ్చారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పటి నుంచే సమష్టి కృషితో సిద్ధమై పార్టీ విజయానికి బాటలు వేయాలని సూచించారు.
 

Back to Top