పార్టీని గ్రామస్థాయిలో మరింత బలోపేతం చేద్దాం

కార్యకర్తల సమావేశంలో వడ్డీ రఘురామ్‌ నాయుడు

తాడేపల్లిగూడెం: స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ ఇన్‌చార్జ్‌ వడ్డీ రఘురామ్‌ నాయుడు పిలుపునిచ్చారు. పెంటపాడు మండలం పడమర విప్పర్రు గ్రామంలో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రఘురామ్‌ నాయుడు మాట్లాడుతూ పార్టీని గ్రామస్థాయిలో మరింత బలోపేతం చేయాలని, నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేసి వైయ‌స్ఆర్‌సీపీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త క్రమశిక్షణతో పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. 
 

Back to Top