వైయస్‌ఆర్ జిల్లా: కడపలో వైయస్ఆర్‌సీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్‌రెడ్డి హాజరై పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయస్ఆర్‌సీపీ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ సమష్టిగా పనిచేయాలని వైయస్ అవినాష్‌రెడ్డి పిలుపునిచ్చారు. పార్టీలోని చిన్నచిన్న మనస్పర్థలు, తారతమ్యాలను పక్కనపెట్టి నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా ముందుకు సాగాలని సూచించారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అవినీతి, అక్రమాలపై ప్రజల తరఫున పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఎన్ని కేసులు, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కడప కార్పొరేషన్‌లో వైయస్ఆర్‌సీపీని గెలిపించుకోవాలని వైయస్ అవినాష్‌రెడ్డి స్పష్టం చేశారు. రాజకీయ ప్రత్యర్థిగా టీడీపీని మాత్రమే గుర్తుంచుకుని, పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. రానున్న రోజుల్లో వైయస్ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలకు అందించిన ఐడీ కార్డులను చూసి గౌరవం ఇచ్చే కాలం ముందుందని వైయస్ అవినాష్‌రెడ్డి తెలిపారు. పార్టీ శ్రేణులంతా ధైర్యంగా, ఐక్యంగా పనిచేస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయస్ఆర్‌సీపీ ఘన విజయం సాధిస్తుందని పేర్కొన్నారు.