కవిసామ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ సాహిత్యం చిరస్మరణీయం

విజయవాడలో ఘనంగా విశ్వనాథ సత్యనారాయణ జయంతి

లెనిన్‌ సెంటర్‌లో విగ్రహానికి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు

విజయవాడ: భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, కుటుంబ వ్యవస్థలోని విలువలను తన రచనల ద్వారా ప్రపంచానికి చాటిచెప్పిన కవిసామ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ తెలుగు సాహిత్యానికి చేసిన సేవలు చిరస్మరణీయమని వైయ‌స్ఆర్‌సీపీ విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కొనియాడారు. విశ్వనాథ సత్యనారాయణ జయంతి సందర్భంగా గురువారం విజయవాడ లెనిన్‌ సెంటర్‌లోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ‘వేయిపడగలు’, ‘రామాయణ కల్పవృక్షం’ వంటి జగద్విఖ్యాత రచనలను అందించిన విశ్వనాథ సత్యనారాయణ జ్ఞానపీఠ్‌, పద్మభూషణ్‌ పురస్కారాలను అందుకున్న మహోన్నత సాహితీమూర్తి అని పేర్కొన్నారు. విజయవాడ వాసిగా ఆయన అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం తెలుగువారందరికీ గర్వకారణమన్నారు.

జ‌గ‌న్‌ 2.0 ప్రభుత్వంలో అధికారిక సాహితీ దినోత్సవం

తెలుగు భాషా వికాసానికి, సాహిత్య పునరుజ్జీవనానికి విశ్వనాథ సత్యనారాయణ చేసిన కృషిని భవిష్యత్‌ తరాలు స్మరించుకునేలా కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని మల్లాది విష్ణు అన్నారు. రాబోయే జగన్మోహన్‌రెడ్డి 2.0 ప్రభుత్వంలో విశ్వనాథ సత్యనారాయణ జయంతిని అధికారిక సాహితీ దినోత్సవంగా ప్రకటించేలా వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. రాష్ట్రంలోని కవులు, రచయితలను గౌరవించి వారి సృజనాత్మక రచనలను ప్రోత్సహించడమే లక్ష్యంగా చర్యలు చేపడతామని చెప్పారు.

‘వేయిపడగలు’, ‘ఆంధ్రప్రశస్తి’ వంటి రచనలు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, తెలుగువారి పూర్వ వైభవాన్ని ప్రతిబింబిస్తూ చిరస్థాయిగా నిలిచిపోతాయని మల్లాది విష్ణు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్‌ పురస్కారంతో విశ్వనాథను సత్కరించడం ఆయన సాహితీ ప్రతిభకు దక్కిన గౌరవమన్నారు.

ఈ కార్యక్రమంలో విశ్వనాథ సత్యనారాయణ, చల్లా సుధాకర్‌, మాజీ కార్పొరేటర్‌ శర్వాణి మూర్తి, కురిటి శివ, తాడి శివ, దోనేపూడి శ్రీనివాస్‌రావు, యర్రంశెట్టి అంజిబాబు, వడ్డి వాసు, సనత్‌, చాంద్‌, మల్లిక్‌, బండారు ఆంజనేయులు, చంద్రశేఖర్‌, భోగాది మురళి, బెవర శ్రీను, సిద్ధబత్తుల రమణ, మజ్జి రాము, సుధీర్‌, మీసాల సత్యనారాయణ, అక్బర్‌, దాలి నాయుడు తదితరులు, అభిమానులు పాల్గొన్నారు.
 

Back to Top