వినుకొండ: వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ఈరోజు వినుకొండలోని పార్టీ కార్యాలయంలో వైయస్ఆర్‌సీపీ నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రేపు మధ్యాహ్నం 3 గంటలకు బ్రహ్మనాయుడు కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించనున్న వినుకొండ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం, పార్టీ ఐడీ కార్డుల పంపిణీ కార్యక్రమంపై నాయకులతో చర్చించారు. ఈ సమావేశానికి నియోజకవర్గంలోని వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అన్ని అనుబంధ విభాగాల అధ్యక్షులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, నాయకులు, పార్టీ శ్రేణులు తప్పనిసరిగా హాజరుకావాలని బొల్లా బ్రహ్మనాయుడు సూచించారు. పార్టీని మరింత బలోపేతం చేయడం, రానున్న కార్యక్రమాలను సమన్వయంతో ముందుకు తీసుకెళ్లడం కోసం నిర్వహిస్తున్న ఈ విస్తృత స్థాయి సమావేశానికి ప్రతి ఒక్కరూ సమయానికి హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.