నెల్లూరు: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే వైయస్ఆర్‌సీపీ అభ్యర్థులకు పార్టీ పూర్తి అండగా ఉంటుందని వైయస్ఆర్‌సీపీ రీజినల్ కోఆర్డినేటర్, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి తెలిపారు. వైయస్ఆర్‌సీపీకి నెల్లూరు జిల్లా కంచుకోట వంటిదని, పార్టీ ఆవిర్భావం నుంచి జిల్లాలో జరిగిన పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయస్ఆర్‌సీపీదే పైచేయిగా ఉందని పేర్కొన్నారు. ఈసారి కూడా జిల్లాలో అన్ని స్థానాల్లో వైయస్ఆర్‌సీపీ విజయం సాధిస్తుందని మిథున్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థికి పార్టీ నాయకత్వం అండగా నిలుస్తుందని, నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలని సూచించారు. చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఒక్కటినీ సక్రమంగా అమలు చేయడం లేదని పేర్కొన్నారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో అధికార పార్టీ వైయస్ఆర్‌సీపీని ఎదుర్కోలేక పోలీసులను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయస్ఆర్‌సీపీ కచ్చితంగా విజయం సాధిస్తుందని, ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని అన్ని స్థానాల్లో పార్టీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.