అనంతపురం: వైయస్ఆర్‌సీపీ సీనియర్ నాయకుడు, స్వర్గీయ తోపుదుర్తి భాస్కర్‌రెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా తోపుదుర్తి గ్రామంలోని భాస్కర్‌రెడ్డి తోటలో ఉన్న ఘాట్ వద్ద అనంతపురం జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, తోపుదుర్తి కుటుంబ సభ్యులు, అభిమానులతో కలిసి ఘనంగా నివాళులర్పించారు. భాస్కర్‌రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి, ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా భాస్కర్‌రెడ్డి పార్టీ కోసం చేసిన సేవలు, నాయకులు, కార్యకర్తలతో ఆయనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఆయనను అభిమానించే నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు ఘాట్ వద్ద నివాళులర్పించి ఆయనతో తమకున్న అనుబంధాన్ని స్మరించుకున్నారు. కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.