క్షేత్రస్థాయిలో వైయ‌స్ఆర్‌సీపీని మరింత బలోపేతం చేద్దాం

 మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్

శింగనమల: శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ ఆధ్వర్యంలో వైయ‌స్ఆర్‌సీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తల విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పార్టీ బలోపేతం, నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు. పార్టీ శ్రేణులంతా ఐక్యంగా, సమన్వయంతో పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని శైలజానాథ్ పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామిరెడ్డి, గుంతకల్ మాజీ శాసనసభ్యులు వై. వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్సీ శివరామిరెడ్డి, పార్లమెంట్ అబ్జర్వర్ నరేష్ కుమార్ రెడ్డి, అసెంబ్లీ అబ్జర్వర్ ఎల్.ఎం. మోహన్ రెడ్డి, జడ్పీటీసీలు బోగాతి ప్రతాపరెడ్డి, భాస్కర్, రైతు విభాగం నాయకులు శ్రీరామ్ రెడ్డి, తరిమెల వంశీ గోకుల్ రెడ్డి, మండల కన్వీనర్లు మహేశ్వర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, ఖాదర్, ఎల్లారెడ్డి, శివ శంకర్, యువ నాయకులు సాకే రుత్విక్ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
 

Back to Top