ఏలూరు జిల్లా: వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఏలూరు జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు అధ్యక్షతన పార్వతీపురం ఏ కన్వెన్షన్ కల్యాణ మండపంలో జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు శ్రేణులను సిద్ధం చేయడం, నాయకులు–కార్యకర్తల మధ్య సమన్వయంతో పనిచేయడంపై సమావేశంలో చర్చించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకుడు వంకా రవీంద్రనాథ్, పీఏసీ సభ్యుడు, ఉంగుటూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ పుప్పాల వాసుబాబు, నూజివీడు నియోజకవర్గ ఇన్‌చార్జ్ మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, పోలవరం నియోజకవర్గ ఇన్‌చార్జ్ తెల్లం బాలరాజు, దెందులూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ తరఫున కొఠారు రామచంద్రరావు, ఏలూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ మామిడిపల్లి జయప్రకాష్, చింతలపూడి నియోజకవర్గ ఇన్‌చార్జ్ కంభం విజయరాజు, రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు పాల్గొన్నారు. ఏలూరు నియోజకవర్గ పరిశీలకుడు డీవీఆర్‌కే చౌదరి, చింతలపూడి పరిశీలకుడు దాసరి రమేష్, పోలవరం పరిశీలకుడు కనుమూరి శివాజీ, నూజివీడు పరిశీలకుడు వాసంశెట్టి గంగాధర్‌రావు, ఉంగుటూరు పరిశీలకుడు సుబ్బరాజు, రాష్ట్ర బీసీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నౌడ వెంకటరమణ, రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ అధ్యక్షుడు కోమటి విష్ణువర్ధన్, రాష్ట్ర సూర్య వలిజ కార్పొరేషన్ అధ్యక్షుడు శెట్టి రాజా, రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ అధ్యక్షుడు ముంగర సంజయ్‌కుమార్, నగర అధ్యక్షుడు గుడిసె శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ వైయస్ఆర్‌సీపీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేయాలని సమావేశంలో దిశానిర్దేశం చేశారు.