సర్వేపల్లిలో టీడీపీకి భారీ షాక్‌.. 

కాకాణి గోవర్ధన్‌రెడ్డి సమక్షంలో వైయ‌స్ఆర్‌సీపీలో చేరిన 70 కుటుంబాలు

నెల్లూరు జిల్లా: సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలం కాకర్లవారిపాలెం గ్రామంలో టీడీపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీని వీడి 70 కుటుంబాలు వైయ‌స్ఆర్‌సీపీలో చేరాయి. నెల్లూరులోని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఆయన వారికి వైయ‌స్ఆర్‌సీపీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

వైయ‌స్ఆర్‌సీపీ సిద్ధాంతాలు, విధానాలపై విశ్వాసంతోనే పార్టీలో చేరుతున్నట్లు కుటుంబాలు స్పష్టం చేశాయి. కాకాణి గోవర్ధన్‌రెడ్డి నాయకత్వానికి మద్దతుగా పెద్ద సంఖ్యలో చేరికలు జరగడంతో సర్వేపల్లి నియోజకవర్గంలో వైయ‌స్ఆర్‌సీపీకి గ్రామస్థాయిలో ప్రజా మద్దతు మరింత బలపడుతోంది. దీంతో నియోజకవర్గంలో వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది.
 

Back to Top