మీరే నా స్ఫూర్తి.. మీ ఆశీస్సులే నా ధైర్యం

మహానేత వైయ‌స్ఆర్‌కు నివాళులర్పించిన మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయ‌స్ జగన్

తాడేపల్లి: దివంగత మహానేత డాక్టర్ వైయ‌స్ఆర్ 77వ జయంతి సందర్భంగా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి భావోద్వేగ నివాళులర్పించారు.

"మీరే నా స్ఫూర్తి.. మీ ఆశీస్సులే నా ధైర్యం.. మిస్ యూ నాన్నా.." అంటూ సోషల్ మీడియా వేదికగా మహానేత వైయ‌స్ఆర్‌ను స్మరించుకున్నారు. ఇడుపులపాయలోని వైయ‌స్ఆర్ ఘాట్ వద్ద మహానేతకు పూలమాలలు సమర్పించి నివాళులర్పిస్తున్న ఫొటోలు ఆయన పంచుకున్నారు.

ప్రజాసేవ, సంక్షేమ పాలనకు చిరునామాగా నిలిచిన మహానేత వైయ‌స్ఆర్ ఆశయాలు తనకు ఎల్లప్పుడూ మార్గదర్శకమని, ఆయన ఆశీస్సులే తనకు బలమని శ్రీ వైయ‌స్ జగన్ తన సందేశంలో పేర్కొన్నారు. ఆయన చేసిన ఈ భావోద్వేగ పోస్టు వైయ‌స్ఆర్ అభిమానులు, పార్టీ శ్రేణులను కదిలించింది.
 

Back to Top