సిడ్నీలో డాక్టర్ వైయ‌స్ఆర్‌ జయంతి వేడుకలకు ముమ్మర ఏర్పాట్లు 

జూమ్ సమావేశంలో పాల్గొన్న రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్ రెడ్డి.. 

వేడుక‌లు విజయవంతంగా నిర్వహించాలని పిలుపు 

ఆస్ట్రేలియా: మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.య‌స్. రాజశేఖర రెడ్డి జయంతిని పురస్కరించుకుని జూలై 8న సిడ్నీలో నిర్వహించనున్న వేడుకల ఏర్పాట్లపై వైయ‌స్ఆర్‌సీపీ ఎన్‌ఆర్‌ఐ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన జూమ్ సమావేశంలో అన్నమయ్య జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్ రెడ్డి పాల్గొని ప్రవాస తెలుగు ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. మహానేత డాక్టర్ వైయ‌స్ఆర్‌ ఆశయాలను భావితరాలకు చాటిచెప్పేలా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. విదేశాల్లోనూ వైయ‌స్ఆర్‌ సంక్షేమ తత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్న ఎన్‌ఆర్‌ఐ కార్యకర్తలను అభినందించారు.

సిడ్నీ కన్వీనర్  అమర్‌నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఒంటిమిట్ట వేణుగోపాల్ రెడ్డి, దీపు సిరిపురం, కృష్ణ చైతన్య, రామనాథ్ రెడ్డి (సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు), చంద్రమౌళి, మల్లికార్జున, పెద్ది రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జూలై 8న నిర్వహించే జయంతి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పలు సూచనలు, కార్యాచరణ ప్రణాళికలపై చర్చించారు. డాక్టర్ వైయ‌స్ఆర్‌ ప్రజాసేవా స్ఫూర్తి, సంక్షేమ భావజాలాన్ని ఆస్ట్రేలియాలోని తెలుగు సమాజంలో మరింత విస్తృతంగా చాటిచెప్పేలా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. మహానేత ఆశయాలను ప్రపంచవ్యాప్తంగా విస్తరించేందుకు వైయ‌స్ఆర్‌సీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగం నిరంతరం కృషి కొనసాగిస్తుందని నిర్వాహకులు తెలిపారు.


 

Back to Top