ముద్రగడ పద్మనాభం చిత్రపటానికి నివాళులర్పించిన వైయస్ జగన్ 

 భీమవరం: భీమవరంలో ఆక్వా రైతులతో నిర్వహించిన సమావేశానికి ముందు వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి స్వర్గీయ ముద్రగడ పద్మనాభం చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. సమావేశం ప్రారంభానికి ముందు ముద్రగడ పద్మనాభం సేవలను స్మరించుకుంటూ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన శ్రీ వైయస్ జగన్, ఆయన ప్రజాసేవ, సామాజిక న్యాయం కోసం చేసిన కృషిని గుర్తుచేసుకున్నారు. అనంతరం ముద్రగడ పద్మనాభం స్మృతికి నివాళిగా సభలో పాల్గొన్న వారంతా మౌనం పాటించి తమ గౌరవాన్ని తెలియజేశారు. తర్వాత ఆక్వా రైతులతో సమావేశ కార్యక్రమం ప్రారంభమైంది.
 

Back to Top