పంచ లింగాల. కర్నూలు: రాష్ట్రంలో వెన్నుపోటు పార్టీ కూటమి పాలనలో అంతులేని కుట్ర రాజకీయాలు సాగుతున్నాయని, రెడ్‌బుక్ రాజ్యాంగంతో వెన్నుపోటు పార్టీ రెచ్చిపోతోందని మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫైర్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో తీవ్రస్థాయిలో అధికార దుర్వినియోగం జరుగుతోంది అన్న ఆయన, అందుకు ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్ ఉదాహరణ అని చెప్పారు. ఇంకా విచిత్రంగా రాష్ట్రంలో బాధితులే నిందితులవుతున్నారని, దాడికి గురైన వారిపైనే కేసులు పెడుతున్నారని, బాధితులకు అండగా నిలబడిన వారిపైనా కేసులు నమోదు చేసి అక్రమంగా అరెస్టులు చేస్తూ, దారుణంగా వేధిస్తున్నారని అన్నారు. చంద్రబాబుది నీచమైన శాడిస్ట్ మెంటాలిటీ అన్న శ్రీ వైయస్ జగన్, కర్నూలు జిల్లా జైలు వద్ద రూల్స్‌కు భిన్నంగా తనను అవమానించారని చెప్పారు. సాధారణంగా ములాఖత్‌కు వచ్చిన వారిని కూర్చోబెట్టి ఫోటో తీస్తారని, కానీ తనను మాత్రం కావాలనే గ్రిల్స్ వెనక నిలబెట్టి ఫోటో తీశారని, అలా ఎందుకని అడిగితే, అలా చేయాలని తమకు పై నుంచి ఆదేశాలు అందాయని జైలు అధికారులు చెప్పారని వెల్లడించారు. ఒక దుష్ట సంప్రదాయాలకు చంద్రబాబు బీజం వేస్తున్నారని, అవి భవిష్యత్తులో విష వృక్షాలు అవుతాయని, కాబట్టి, అంతకంత ఫలితం అనుభవించక తప్పదని తేల్చి చెప్పారు. కర్నూలు జిల్లాలో పర్యటించిన మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి, పంచలింగాల వద్ద జిల్లా జైలులో ఉన్న ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించారు. అనంతరం ఆ జైలు వద్ద శ్రీ వైయస్ జగన్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీ వైయస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..: రాష్ట్రంలో అంతులేని అరాచక పాలన: రాష్ట్రంలో అధికార దుర్వినియోగం అన్నది ఏ స్థాయిలో ఉంది, అన్నది చెప్పడానికి ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి అరెస్ట్ ఒక ఉదాహరణ. అది ఒక స్పష్టమైన ఘట్టంగా, ఉదాహరణగా చరిత్రలో ఎప్పటికీ నిల్చిపోతుంది. రెడ్ బుక్ రాజ్యాంగంతో వెన్నుపోటు పార్టీ పాలనలో, ఆ పార్టీ నాయకుడు రచించిన కుట్ర రాజకీయాలు ఈరోజు మనం చూస్తున్నాం. ఎమ్మెల్యే విరుపాక్షి అక్రమ అరెస్ట్, అన్యాయంగా జైలుకు పంపడం.. ఈ రెండూ కూడా రెడ్ బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో ఎలా అమలవుతోంది అనడానికి అద్దం పడతాయి. వెన్నుపోటు పార్టీ పాలనలో ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి అని అంటే.. బాధితులే నిందితులు అవుతున్నారు. దాడికి గురైన వారిపైనే కేసులు పెడుతున్నారు. బాధితులకు ఎవరైనా అండగా నిలబడితే వారిపైనా కేసులు పెట్టి, అరెస్ట్ చేస్తున్నారు. ఎవరైనా గట్టిగా ప్రశ్నిస్తే కేసులు నమోదు చేస్తున్నారు. ఎవరైనా గట్టిగా నిలదీస్తే ఏకంగా ఆ నిలదీసిన వ్యక్తి ఇంట్లోకి జరబడి తాను ఎమ్మెల్యే అయినా కూడా అర్ధరాత్రి పూట వందల మంది పోలీసులను తీసుకొని వచ్చి ఇంట్లోకి జొరబడి ఇల్లును ధ్వంసం చేసి మరీ అరెస్ట్ చేసి జైల్లో పెడుతున్న పరిస్థితి చూస్తున్నాం. గాంధీ పుట్టిన దేశంలో ప్రజాస్వామ్యం ఖూనీ: నేను అడుగుతున్నాను. ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా ఆలోచన చేయాలి. ఎలాంటి ప్రజాస్వామ్యంలో మనం బ్రతుకుతున్నామని. గాంధీ పుట్టిన దేశంలో ఇవాళ ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది. అలాంటి పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యే.. ప్రజలు ఓటు వేస్తే ఎన్నుకోబడిన ఎమ్మెల్యే పరిస్థితి ఏమిటి అని అంటే, ఆయన ఇంటిపై వందల మంది పోలీసులు.. అర్ధరాత్రి 2.45 గం.కు చంద్రబాబునాయుడుగారి డైరెక్షన్‌తో ఆయన ఇంట్లోకి చొరబడ్డారు. తన ఇంట్లో ఎమ్మెల్యే నిద్ర పోతున్న సమయంలో డోర్లు పగలగొట్టి సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, బలవంతంగా లాక్కెళ్లారు. అర్ధరాత్రి దాటిన తర్వాత దొంగల మాదిరిగా పోలీసులు రావడం, బందిపోటు ముఠాల మాదిరిగా దాడి చేసినంత పని చేయడం, సీసీ కెమెరాలు ధ్వంసం చేసి తీసుకెళ్లడం, ఇంటి తలుపులు పగలగొట్టడం, ఇంట్లోకి చొరబడడం, ఎమ్మెల్యేను అపహరించుకుపోవడం ఎంత దారుణం. గంటల వ్యవధిలో కేసులు. అరెస్టులు: నేను అడుగుతున్నాను. ఎమ్మెల్యే ఏమైనా ఉగ్రవాదా? పగటిపూట నోటీస్ ఇస్తే ఎమ్మెల్యే రాడా? ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా, గంటల వ్యవధిలోనే గంటల వ్యవధిలోనే టపా టపా టపా అని చెప్పి ఎమ్మెల్యే మీద మూడు కేసులు పెట్టారు. ఒక కేసులో 34 మంది మీద ఒక కేసులో ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తే. రెండో కేసులో మొదట పెట్టిన 34 మంది కాక మరో 14 మందిని చేర్చి మళ్లీ ఇబ్బంది పెట్టే కార్యక్రమం. మూడో కేసుకి వచ్చేసరికే మరో 12 మందిని మళ్లీ ఇరికించే కార్యక్రమం. మోత్తంగా 38 మందిని రిమాండ్‌కు పంపారు. ఇంతకన్నా దారుణం ఇంకొక విషయం ఏమిటి అని అంటే, ఎమ్మెల్యేతోనే సరిపెట్టకుండా, ఎమ్మెల్యే కొడుకును, ఎమ్మెల్యే తమ్ముడిని, ఆ తమ్ముడి కొడుకును మొత్తం అందరిని జైల్లో పెట్టారు. అంతేకాదు, మరో తమ్ముడి కొడుకును ఇరికించే కార్యక్రమం చేశారు. ఇలా మొత్తం కుటుంబాన్ని మొత్తం టార్గెట్ చేస్తా ఉన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యే విరుపాక్షి వ్యవహారంలో 6 నేరాలు: ఎమ్మెల్యే విరుపాక్షి అరెస్ట్ వ్యవహరాంలో మొత్తం 6 నేరాలు చేశారు. అవన్నీ క్లుప్తంగా ప్రస్తావిస్తాను. రాష్ట్రంలో అసలు న్యాయం, ధర్మం బతికున్నాయా లేదా అన్నది ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆలోచించాలని కోరుతున్నాను. ఇవీ ఆ నేరాల పరంపర: – చిప్పగిరి మండలంలో సంగాల అనే ఊరు 6 కి.మీ దూరంలో ఉంది. ఆ ఊరి నుంచి గిరి అనే కార్యకర్త ఆగస్టు 1న, సాయంత్రం ఎమ్మెల్యే విరుపాక్షికి ఫోన్ చేసి, తన ఇంటిపై దాడి చేశారని సమాచారం ఇచ్చారు. ఆ రాత్రి 7.45 గం.కు ఆ దాడికి సంబంధించిన ఫోటో, వీడియో కూడా పంపారంటూ.. ఆ కాల్ రికార్డును శ్రీ వైయస్ జగన్, మీడియాకు చూపారు. అన్నా, నా ఇంటి మీద దాడి జరుగుతోంది. నా మీద దాడి చేస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉంది. నన్ను కాపాడండి.. అని గిరి అనే కార్యకర్త ఎమ్మెల్యేకు రాత్రి 7.45కి ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. ఆ ఫోటోలు, వీడియో చూసి నివ్వెరపోయిన ఎమ్మెల్యే రెండు నిమిషాల్లోనే, అంటే ఆ రాత్రి 7.47 గం.కు చిప్పగిరి ఎస్‌ఐకి ఫోన్ చేసి విషయం చెప్పారు. సంగాలలో తన పార్టీ కార్యకర్త ఇంటిపై దాడి చేశారని, వెళ్లి కాపాడాలని కోరారు. ఆ తర్వాత సీఐకి ఫోన్ చేస్తే, ఆయన ఫోన్ ఎత్తలేదు. మళ్లీ రాత్రి 8.03 గం.కు ఫోన్ చేస్తే, సీఐ మాట్లాడారు. ఆయనకు మొత్తం విషయం చెప్పి, సంగాలలో తమ పార్టీ కార్యకర్తను కాపాడాలని ఎమ్మెల్యే కోరారు. కానీ, పోలీసులు స్పందించలేదు. ఒక మనిషి మీద దాడి జరుగుతోంది. వెళ్లి కాపాడండి అని స్వయంగా ఎమ్మెల్యే ఫోన్ చేసినా, దిక్కు దివాణం లేకపోతే, ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటి? అసలు ఎమ్మెల్యే అని కాదు. ఆపదలో ఉన్న ఎవరినైనా కాపాడడం పోలీసుల డ్యూటీ. కానీ, వారు స్పందించలేదు. ఆలోపు రాత్రి 8.08 గం.కు సంగాల నుంచి గిరి మళ్లీ ఫోన్ చేసి, అక్కడి దారుణ పరిస్థితిని ఎమ్మెల్యేకు వివరించారు. మీరు (ఎమ్మెల్యే) రాకపోతే నేను ఇబ్బంది పడే పరిస్థితిలో ఉన్నాను. పోలీసులు ఎవరూ రావడం లేదు. కాబట్టి ఎలాగైనా కాపాడాలని వేడుకున్నాడు. ఎంతో మానవత్వం ఉన్న ఎమ్మెల్యే వెంటనే బయలుదేరి సంగాల వెళ్లారు. అలా ఎమ్మెల్యే దాడి జరిగిన ఊరికి వెళ్లడం నేరం అంట!. కేసు పెట్టారు. అది మొదటి కేసు. ప్రజాస్వామ్యంలో అక్రమ కేసులు ఎలా పెడుతున్నారు? చంద్రబాబునాయుడుగారి వెన్నుపోటు పాలనలో, కుట్రల పాలనలో ఏ రకంగా ప్రజలు హింసించబడుతున్నారు? అనడానికి ఆ అక్రమ కేసు ఒక నిదర్శనం. సంగాల వెళ్లిన ఎమ్మెల్యే గిరిని తోడ్కొని తన వెంట తీసుకుని బయలుదేరగా, దారిలో నేమకల్లు వద్ద దారి కాచి ఎమ్మెల్యే మీద, గిరి మీద దాడి చేశారు. ఎమ్మెల్యే తమ్ముడు శ్రీరాములు చేయి విరగొట్టారు. ఆ నేరాలన్నీ కప్పి పుచ్చుకోవడానికి ఏకంగా వెన్నుపోటు పార్టీ కార్యకర్త ఒకరు నేమకల్లులో తన భార్య దుస్తులు తానే స్వయంగా చింపేశారు. భర్త స్వయంగా భార్య దుస్తులు అందరూ చూస్తుండగా, చింపడమే కాకుండా, దాన్ని ఎమ్మెల్యే అతని మనుషులకు అంటగట్టారు. ఒక దళిత మహిళ దుస్తులు చింపారంటూ.. ఎమ్మెల్యే మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. చంద్రబాబు సిగ్గుతో తల దించుకోవాలి: నేను అడుగుతున్నాను ఇదే చంద్రబాబునాయుడుగారిని. అయ్యా చంద్రబాబుగారు మా వాళ్ళ మీద నువ్వు తప్పుడు కేసులు పెట్టడానికి మీ కార్యకర్తల బట్టలను సైతం మీ వాళ్ళ భర్తలతో చింపించే స్థాయికి నీ వెన్నుపోటు పార్టీ దిగజారిపోయింది అని అంటే నువ్వు తలకాయ వంచుకోవాలి. నీ కుట్రలు చేయడం కోసం ఏ స్థాయికి దిగజారిపోతా ఉన్నావు అని ఒకసారి ఆలోచన చేయమని అడుగుతున్నాను. కట్టుకున్న భార్య బట్టలను పది మంది ముందు, పది మంది చూస్తూ ఉండగా చింపి, కుట్రలు చేయడం.. నిజంగా రాజకీయాలను ఏ స్థాయికి దిగజార్చారో గమనించమని కోరుతున్నాను. రాష్ట్రమే నివ్వెరపోయింది: ఆ వీడియో బయటకు వచ్చిన తర్వాత కూడా, మళ్లీ ఆ ఆడబిడ్డను కూడా వాడుకొని తప్పుడు మాటలు చెప్పించారు. తన భార్య దుస్తులు భర్త స్వయంగా చింపుతున్న వీడియో బయటకు వచ్చి, వైరల్ అయింది. అది చూసి రాష్ట్రం మొత్తం నివ్వెరపోయింది. చంద్రబాబునాయుడుగారి కుట్రల రాజకీయాలను చూసి, ఈ వెన్నుపోటు పాలనను చూసి రాష్ట్రం మొత్తం షాక్‌కి గురైంది. మీరు కూడా ఒకసారి ఆ వీడియో చూడండి. (అంటూ ఆ వీడియోను మొత్తం శ్రీ వైయస్ జగన్ మీడియాకు ప్రదర్శించి చూపారు) స్వార్థ రాజకీయాల కోసం నిజంగా ఏ స్థాయిలోకి చంద్రబాబునాయుడు దిగజారిపోయినాడు అని చెప్పడానికి, వెన్నుపోటు పార్టీ నాయకుడు కుట్రలు చేసి, వెన్నుపోటు పార్టీ పాలనలో ఏ రకంగా వ్యవస్థలు ఉన్నాయని చెప్పడానికి నిదర్శనం. ఎమ్మెల్యే మీద కేసుల పర్వం: ఇన్ని చేసి ఎమ్మెల్యే మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. అది రెండో కేసు. అదే గ్రామంలో ఎమ్మెల్యే మీద పెట్టిన మూడో కేసు ఏమిటో తెలుసా? ఎమ్మెల్యే కారును ధ్వంసం చేశారంట! కారును ధ్వంసం చేశారంటూ మూడో కేసు పెట్టారు! మీరే కారుపై దాడి చేస్తారు. మీరే ఎమ్మెల్యే తమ్ముడి చేయి విరగ్గొడతారు. దారిలో పోతున్న ఎమ్మెల్యేపైనా దాడి చేస్తారు. మళ్లీ ఎమ్మెల్యే మీద ఎస్సీ ఎస్టీ కేసు పెడతారు. కారుపై దాడి చేశారని మూడో కేసు పెడతారు. నేను అడుగుతున్నాను. ఇలాంటి అక్రమ కేసులు ఈ మాదిరిగా ప్రజాస్వామ్యంలో పెడతూ పోతే అసలు ప్రజాస్వామ్యం బతుకుతుందా? అనేది ఆలోచన చేయమని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. ఎమ్మెల్యే ఫిర్యాదు బేఖాతరు: ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? తనపై దాడి తర్వాత ఎమ్మెల్యే స్వయంగా తమ్ముడు శ్రీరాములును తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి, ఆధారాలు కూడా చూపి కేసు నమోదు చేయమంటే, వారు కనీసం ఫిర్యాదు కూడా స్వీకరించలేదు. అంటే ఒక నష్టపోయిన వ్యక్తి పోలీస్‌స్టేషన్‌కు వెళ్తే, ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి వచ్చి ఫిర్యాదు చేసినా, తీసుకోని పరిస్థితిలో ఈ రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లు పని చేస్తున్నాయి. ఇంక సామాన్యుల పరిస్థితి ఏమిటి? ఎవరైనా ధైర్యంగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయగలడా? ప్రజాస్వామ్య వాదులందరూ కూడా ఆలోచన చేసుకోవాలని కోరుతున్నా. అలా ఎమ్మెల్యే స్వయంగా వెళ్లి ఫిర్యాదు చేసినా పట్టించుకోక పోవడం, కేసు నమోదు చేయకపోవడం నాలుగో తప్పిదం. ఇక 5వ తప్పిదం ఏమిటో తెలుసా? ఎమ్మెల్యే మీద రివర్స్ కేసులు పెట్టడం. చంద్రబాబునాయుడుగారు అమలు చేస్తున్న రెడ్‌బుక్ పాలనలో, వెన్నుపోటు పార్టీ పాలనలో ఆయన పెట్టుకున్న ఈ డర్టీ సిస్టం చేస్తున్న పని, రివర్స్‌లో ఎమ్మెల్యేపైనే అక్రమంగా కేసు పెట్టడం. అన్యాయంగా కేసులు. అరెస్టులు: ఇంకా ఎంత అన్యాయంగా వీళ్ళు కేసులు పెడుతున్నారంటే, విరుపాక్షి, ఆయన కుటుంబ సభ్యులు, వైయస్సార్‌సీపీకి చెందిన వారి పేర్లు ఇరికించి, అక్రమ అరెస్టులకు దిగుతున్నారు. ఆ కేసుల నమోదు, ఎఫ్‌ఐఆర్‌లు ఎంత డొల్లతనంగా ఉన్నాయంటే.. ఒక కంప్లైంట్‌లో ఉన్న నలుగురి పేర్లు.. అదే కంప్లైంట్‌లో వేరే నిందితులుగా చూపారు. అంటే సేమ్ పేర్లు రిపీట్. ఏ–10 యాదవల్లి ప్రేమకుమార్. మళ్లీ అదే పేరును ఏ–22 గా చూపారు. ఏ–17 మాలగడి లింగను, మళ్లీ ఏ–25 గా చూపారు. ఏ–19 సత్తిరెడ్డిని మళ్లీ ఏ–23 గా ఎ.సత్యనారాయణరెడ్డి అని రాశారు. ఏ–18 కురవ లింగప్పను, మళ్లీ ఏ–24 గా చూపారు. అలా 30 మందిపై అన్యాయంగా కేసు పెట్టగా, వారిలో 28 మంది జైల్లో ఉన్నారు. ఎలాంటి విచారణ లేదు. ఎఫ్‌ఐఆర్ మామూలుగా రిజిస్టర్ చేసేటప్పుడు, కంప్లైంట్ ఏదైనా రిజిస్టర్ చేసేటప్పుడు ఒక నిందితుడిని ఈ మాదిరిగా చేర్చాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు.. నిజానికి ఇక్కడ కంప్లైంట్ కూడా ఎవరూ ఇవ్వలేదు. పోలీసులు వాళ్లకు వాళ్లే రాసుకున్నారు. ఎంక్వయిరీ కూడా లేదు. ఇది 5వ తప్పు. ఇక 6వ తప్పు ఏమిటో తెలుసా? ఎమ్మెల్యే కంప్లైంట్ తీసుకోకపోగా ఎమ్మెల్యే మన ఇంటికి వెళ్లి తన ఇంట్లో తాను పడుకొని ఉంటే రాత్రి 2.45 గం.కు వందల మంది పోలీసులు వెళ్లి, ఎమ్మెల్యే ఇంటి తలుపులు పగలగొట్టి, సీసీ టీవీలను ధ్వంసం చేసి, వాటిని తీసుకుపోయి, ఏకంగా ఎమ్మెల్యేను అపహరించడం. ఈ ఆరు నేరాలు, తప్పిదాలను నేను సాక్ష్యాలు, ఆధారాలతో సహా చూపుతున్నాను. రెడ్ బుక్ రాజ్యంలో, వెన్నుపోటు పార్టీ పాలనలో కుట్రలు చేస్తూ ఏ రకంగా అన్యాయాలు చేస్తున్నారు అని చెప్పడానికి ఉదాహరణలు. బీసీ నాయకులపై కక్ష: బీసీ నాయకత్వం మీద చంద్రబాబునాయుడుగారు అనే వ్యక్తి ఎలా కుట్రలు చేస్తున్నారు?. పేరు పొందిన బీసీ నాయకులను ఏ రకంగా అక్రమ కేసుల్లో ఇరికిస్తున్నారు? అని చెప్పడానికి ఇంకా కొన్ని ఉదాహరణలు. వైయస్సార్‌సీపీలో ఎదుగుతున్న బీసీ నాయకులను చంద్రబాబునాయుడుగారు ఏ రకంగా లక్ష్యంగా చేసుకున్నారు అని అంటే.. శ్రీకాకుళంలో మొన్న మత్స్యకార బీసీ నాయకుడు డాక్టర్ సీదిరి అప్పలరాజు అరెస్ట్. దానిపై నేను శ్రీకాకుళం వెళ్లి స్వయంగా వివరించాను. ఓ బైక్ యాక్సిడెంట్. అది కారు యాక్సిడెంట్ కూడా కాదు. ఓ బైక్ యాక్సిడెంట్‌ను ఓ రోడ్డు ప్రమాదాన్ని ఏకంగా వక్రీకరించి హత్య కింద కుట్ర కింద హత్య కింద కేస్ బుక్ చేశారు. ఒక బీసీ నాయకుడి 18 ఏళ్ల కొడుకు బైక్ నడుపుతుంటే దురదృష్టవశాత్తూ యాక్సిడెంట్ జరిగింది. దాన్ని హత్య కింద, కుట్ర కింద ఏ రకంగా మలిచి చివరికి అప్పలరాజును సైతం అరెస్ట్ చేశారో మీకు తెలుసు. జైల్లో ఉన్న డాక్టర్ సీదిరి అప్పలరాజును పరామర్శించడానికి, ఆ కుటుంబాన్ని ఓదార్చడానికి నేను శ్రీకాకుళం వెళ్తే, ప్రజలు విపరీతంగా వచ్చిన సందర్భంలో చింతాడ రవికుమార్ అని చెప్పి ఆముదాలవలస మా కోఆర్డినేటర్. బీసీ నాయకుడు కళింగ కులస్తుడు. బీసీ నాయకుడు. ఆయన లేడీ ఎస్‌ఐను చంపబోయాడంట! అంత మంది జనంలో ఆయన లేడీ ఎస్‌ఐని చంపబోయారంట! అసలు ఆమెను చంపాల్సిన అవసరం ఆయనకు ఏముంది? అంత మంది మధ్య ఎవరైనా ఎందుకు పోలీసులను చంపే ప్రయత్నం చేస్తారు? మహిళా ఎస్‌ఐపై ఎందుకు ఆ ప్రయత్నం చేస్తారు? ఏమైనా బుద్ధి జ్ఞానం ఉందా? అలా కేసు ఎలా పెడతారు?. ఈరోజు మళ్ళీ కర్నూలులో బోయ కులస్తుడు బీసీ ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి పరిస్థితి ఏమిటి? అని ఇప్పుడే చెప్పాను. అక్రమ కేసుల్లో ఏ రకంగా బీసీ నాయకత్వాన్ని చంద్రబాబునాయుడుగారు దగ్గరుండి నలిపి వేస్తా ఉన్నాడు అని చెప్పడానికి ఇంకొక ఉదాహరణ మరో ఘటన మాజీ ఎమ్మెల్యే ముస్తఫా. గుంటూరు మాజీ ఎమ్మెల్యే ముస్తఫా మైనారిటీ లీడర్ ఏ రకంగా అక్రమ కేసు పెట్టి ఆయన్ని అరెస్ట్ చేశారో తెలుసు. దానిపై తన కూతురు పూర్తి వివరాలు చెప్పింది. పొగాకు కొనుగోలు చేసేందుకు, వాళ్లు డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు. అయితే ఆ మనిషి సరుకు ఇవ్వలేదు. డబ్బులు వెనక్కి ఇవ్వలేదు. దీనిపై ఆయన ఆ వ్యక్తిని స్వయంగా తీసుకెళ్లి, పోలీసులకు ఫిర్యాదు చేస్తే, తిరిగి ఆయనపైనే కిడ్నాప్ కేసు పెట్టారు. ఇదెక్కడి న్యాయమో ఆలోచించమని కోరుతున్నాను. మరో యాదవ నాయకుడు కారుమూరి సునిల్. మన పార్టీ తరపున ఏలూరు ఎంపీగా పోటీ చేశాడు. బీసీ నాయకుడు. యాదవ కులస్తుడు. ఆయన మీద మరో అక్రమ కేసు. జిల్లా పరిధిలో టెండర్లు పిలుస్తారు మద్యం రవాణా కోసం. ఆ టెండర్లు డిస్ట్రిక్ట్ కలెక్టర్ పిలుస్తాడు. ఆయా జిల్లాలలో మద్యం రవాణా కోసం టెండర్లు పిలుస్తారు. ఆ టెండర్లు అక్రమంగా దక్కించుకున్నారంటూ కారుమూరి సునిల్‌పై కేసు పెట్టి అరెస్ట్ చేశారు. జిల్లా స్థాయిలో జరిగే టెండర్లు. దాంట్లో ఆయన్ను అరెస్ట్ చేశారు. ఏ కేసు పడితే ఆ కేసు, ఎవడి మీద చేయాలనుకుంటే వాడి మీద అక్రమ కేసులు ఇష్టం వచ్చినట్టుగా పెట్టడం, దొంగ సాక్ష్యాలను సృష్టించడం, ఇష్టం వచ్చినట్టుగా అరెస్టులు చేసుకుంటూ పోవడం రాష్ట్రంలో ఇవాళ జరుగుతోంది. కర్నూలు జైలు వద్ద అవమానం. చంద్రబాబు శాడిజమ్: వెన్నుపోటు పార్టీ పాలనలో ఈరోజు రాష్ట్రంలో ఎంత హేయమైన పరిస్థితి కొనసాగుతోంది అనడానికి మరో ఉదాహరణ. ఈ జైలులో ఉన్న మా పార్టీ ఎమ్మెల్యే విరూపాక్షిని ములాఖత్‌ఓల కలవడానికి నేను వచ్చాను. ఒక మాజీ ముఖ్యమంత్రిని. నన్ను ఇక్కడ దారుణంగా అవమానించారు. ములాఖత్‌కు ఎవరు వచ్చినా, వారిని లోపల కూర్చోబెట్టి ఫోటో తీస్తారు. అలా ఫోటో తీసిన తర్వాతే లోపలికి పంపిస్తారు. కానీ, నన్ను అవమానించాలని.. ఎంత శాడిజమో చూడండి. చంద్రబాబునాయుడుగారికి ఎంత శాడిస్టిక్ మెంటాలిటీ ఉంటుంది అని చెప్పడానికి ఇదే ఉదాహరణ. ములాఖత్‌కు ముందు అందరిలా నన్ను లోపల కూర్చోబెట్టి ఫోటో తీయలేదు. నన్ను గ్రిల్ బయట నిలబెట్టించి, గ్రిల్ బయటనే ఫోటో తీశారు. మామూలుగా అందరికీ అలాగే చేస్తారా? అని నేను అడిగాను. ఎందుకంటే, మా ప్రభుత్వ హయాంలో పోలీస్ వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకొచ్చాం. ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ అమలు చేశాం. పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ అని ఏర్పాటు చేశాం. పోలీస్ స్టేషన్‌కి ఎవడైనా వచ్చినా కంప్లైంట్ ఇవ్వడానికైనా, వేరే పని మీద వచ్చినా కూడా కూర్చోబెట్టి మర్యాద ఇచ్చాం. చిక్కటి చిరునవ్వుతో కంప్లైంట్ తీసుకునే వ్యవస్థను మేము తీసుకొచ్చాం. అలా పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్‌స్టేషన్ అని మేము తీసుకొస్తే ఇక్కడ నాకు అవమానించే కార్యక్రమం చేశారు. అందరినీ ఇలాగే గ్రిల్ బయట నిలబెటి ఫోటో తీస్తారా? అని జైలు సూపరింటెండెంట్‌ను అడిగితే.. లేదు సార్ అందరిని మామూలుగా అయితే కూర్చోబెడతాము. మీరు కాబట్టి నిలబెట్టించి ఈ మాదిరిగా చేయాలని చెప్పి మాకు ఆదేశాలు వచ్చాయి సర్ అని చెప్పాడు. విషబీజాలు నాటుతున్నారు. రేపు అవే మహా వృక్షాలవుతాయి: చంద్రబాబుది ఎంత శాడిజమో చూడండి. నేను ఇప్పుడు చంద్రబాబునాయుడుకు చెబుతున్నాను. ఎల్లకాలం మీ ప్రభుత్వమే ఉండదు. ఇది గట్టిగా చెబుతున్నా. మీరు ఈరోజు ఏవైతే దుష్ట సంప్రదాయాల విష బీజాలు విత్తుతున్నారో.. రేపు అవే రెండింతలై మీకు చుట్టుకుంటాయి. అని చంద్రబాబుగారికి గట్టిగా వార్నింగ్ ఇస్తూ చెబతున్నాను. చూస్తా చూస్తా రెండేళ్ళు అయిపోయింది. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచే సరికి మరో మూడేళ్ళు కూడా అయిపోతాయి. దాని తర్వాత మాత్రం ఇదే చంద్రబాబునాయుడుగారికి చెబుతున్నా. వెన్నుపోటు పార్టీ నాయకుడిగా ఉన్న చంద్రబాబునాయుడుగారికి చెబుతున్నా. ఒక తప్పుడు వ్యవస్థను మీరు క్రియేట్ చేస్తున్నారు. వెంటనే మానుకోకపోతే ఇవి మీకు చుట్టుకుంటాయి. అవి రెండింతలు అవుతాయని చెప్పి, మరోసారి చంద్రబాబునాయుడుగారికి గట్టిగా వార్నింగ్ ఇచ్చి చెబుతున్నానని శ్రీ వైయస్ జగన్ స్పష్టం చేశారు.