కర్నూలు: డీఎస్సీ నియామకాల్లో తమకు జరిగిన అన్యాయాన్ని వివరించేందుకు పలువురు డీఎస్సీ అభ్యర్థులు వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిశారు. కర్నూలులోని వెంకన్నబావి ప్రాంతంలో వైఎస్ జగన్‌ను కలిసిన అభ్యర్థులు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. తమకు అండగా నిలిచి న్యాయం జరిగేలా పోరాడాలని వైఎస్ జగన్‌ను అభ్యర్థులు కోరారు. డీఎస్సీ నియామకాల్లో చోటుచేసుకున్న అవకతవకలతో తాము తీవ్రంగా నష్టపోయామని, ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న తమకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. “మీరే దిక్కు” అంటూ తమ బాధను వైఎస్ జగన్ వద్ద చెప్పుకున్నారు.