చిత్తూరు: మెగా డీఎస్సీలో అక్రమాలకు నిరసనగా వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో పూతలపట్టులో నిర్వహించిన నిరసన ర్యాలీపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మాజీ ఎమ్మెల్యే, పూతలపట్టు నియోజకవర్గ ఇన్‌చార్జి సునీల్‌కుమార్‌ను ఏ1గా, మాజీ ఎమ్మెల్యే లలితకుమారిని ఏ2గా పేర్కొంటూ మొత్తం 25 మంది వైయస్ఆర్‌సీపీ నాయకులపై కేసులు నమోదు చేశారు. డీఎస్సీ అక్రమాలపై నిరుద్యోగుల తరఫున నిరసన తెలిపిన నాయకులపై కేసులు నమోదు చేయడం కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్న తీరును స్పష్టం చేస్తోంది. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపే హక్కును అణచివేయకుండా, డీఎస్సీ వ్యవహారంపై దృష్టి సారించి నిరుద్యోగులకు న్యాయం చేయాలి.